Published On: Thu, Mar 5th, 2020

ఇండియాకు సొంత సోషల్‌ మీడియా..!

Share This
Tags

దేశంలో సొంత సోషల్‌ మీడియా(సామాజిక మాధ్యమాలు)ను రూపొందించే విధంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో హ్యాకింగ్, డేటా చౌర్యాలు ఎక్కువవుతున్న తరుణంలో భారత్‌ సొంత సామాజిక మాధ్యమాలను రూపోందించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు టెక్ మహీంద్రా సీటీఓ, జాతీయ భద్రతా నిపుణుడు అమిత్ దుబే తెలిపారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో దుబే మాట్లాడుతూ..దేశంలో సొంత ఫేస్‌బుక్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్‌ లాంటి వాటిని రూపకల్పన చేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

దేశంలో సామాజిక మాధ్యమాలకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యిందని, ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో డ్రాఫ్ట్‌ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. సొంత సామాజిక మాధ్యమాలు రూపొందించే దేశాలలో చైనా ముందుంజలో ఉందని, చైనాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ పనిచేయదని దుబే తెలిపారు. పౌరుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Key Words: India is thinking to establish own social mediya

About the Author