Published On: Sat, Mar 7th, 2020

ఊరిస్తున్న వాట్సాప్‌ ఫీచర్‌ వచ్చేసింది…..

Share This
Tags

కొద్ది నెలలుగా యూజర్లను ఊరిస్తున్న వాట్సాప్‌ డార్క్‌మోడ్‌ ఫీచర్‌ వచ్చేసింది. రాత్రి వేళల్లో వాట్సాప్‌ వినియోగించే యూజర్ల కళ్లకు శ్రమ తగ్గించేందుకు ఈ ఫీచర్‌ తీసుకొచ్చినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఈ వారం ఆరంభంలోనే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రాగా.. భారత యూజర్లకు మాత్రం నేటి (శనివారం) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది యూజర్లు డార్క్‌మోడ్‌ను యాక్టివేట్‌ చేసుకోనున్నారు. ఆండ్రాయిడ్‌ 10, ఐఓఎస్‌ 13లో మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ప్రత్యేక డార్క్‌ గ్రే కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న యాప్‌ తక్కువ లైటింగ్‌ను వెదజల్లుతుంది. రీడబిలిటీ, సమాచార సోపానక్రమం ప్రధానంగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ అధికారులు తెలిపారు.
ఇలా డార్క్‌మోడ్‌ యాక్టివేట్‌ చేయండి
డార్క్‌మోడ్‌ అంటే..సాధారణంగా ఇంటర్నెట్‌ సమాచారమంతా తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌ నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనికి భిన్నంగా నలుపు బ్యాక్‌ గ్రౌండ్‌తో తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల కళ్లకు తక్కువ శ్రమ కలుగుతుంది. రాత్రి వేళల్లో యాప్‌ను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుంది. వాట్సాప్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ నుంచి చాట్స్‌లోకి వెళ్లి థీమ్‌లోకి వెళ్లండి. డార్క్‌ మోడ్‌ను సెలక్ట్‌ చేసుకోండి.

Key words : WhatsApp, the most popular messaging application in the world, is working on some interesting features for the Android and iOS platforms. Some of these were spotted in the recent WhatsApp beta update for both smartphone operating systems. These include the much-awaited Dark Mode, self-destructing messages, option to hide muted status, and a splash screen on both Android and iOS.

About the Author