Published On: Fri, Mar 6th, 2020

సెన్సెక్స్‌1500 పాయింట్లు క్రాష్‌

Share This
Tags

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌1500 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 400 పాయింట్లు పతనమైంది. అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. దీంతో కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ప్రస్తుతం కోలుకున్నప్పటికీ సెన్సెక్స్‌ 38 వేలకు దిగువన, నిఫ్టీ 11వేలకు దిగువన కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1300 పాయింట్లు కుప్పకూలింది. యస్‌బ్యాంకు 15 శాతం కుప్పకూలగా, మార్కెట్లు 6 నెలల కనిష్టానికి చేరాయి. ఎస్‌బీఐ తదితర బ్యాంకింగ్‌ షేర్లతోపాటు, ఆటో,మెటల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టాటా స్టీల్‌, రిలయన్స్‌; ఐసీఐసీఐ బ్యాంకు, ఎం అండ్‌ ఎం, కోల్‌ ఇండియా నష్టపోతుండగా, హెచ్‌యూఎల్‌ ఒక్కటే లాభపడుతోంది. మరోవైపు ప్రైవేటు బ్యాంకు యస్‌బ్యాంకుపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు డిపాజిట్‌ దారుల్లో భారీ ఆందోళన నింపింది. రూ. 50 వేల విత్‌ డ్రాయల్‌ పరిమితి నేపథ్యంలో వారంతా ఏటీఎంల ముందు క్యూ కట్టారు. అలాగే మే నెలకు సంబంధించి ఎఫ్‌ అండ్‌ వో కాంట్రాక్టులు కూడా రద్దయ్యాయి. అటు డాలరుమారకంలో రూపాయి కూడా ఇదే దారిలో వుంది. 74 స్థాయి పతనానికి సమీపంలో వుంది. 73.98 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. అనంతరం 74.07 స్థాయిని తాకింది. ముడి చమురు ధర బ్యారెల్‌ ధర 50 డాలర్లకు దిగువకు చేరింది.
Key words:Stock market down

About the Author