విగ్రహాలను రాజకీయాలకు వాడుకునేందుకు కుట్ర……
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లో పాలేశ్వరస్వామి గుడి లోని 110 సంవత్సరాల నాటి నందీశ్వరుని విగ్రహాన్ని 3 రోడ్ల జంక్షన్ లోని నడిరోడ్డు మీద ఉన్న సిమెంట్ దిమ్మ పైకి తెచ్చి పెట్టి, హిందువుల మనో భావాలను దెబ్బ తీయడమేనని టెక్కలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.. హిందూ ద్రోహి అచ్చెనాయుడు తన అనుచర వర్గం తో ప్రవర్తించిన తీరుకు ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని దువ్వాడ ధ్వజమెత్తారు..
ఈ నెల 15 వ తారీకున మతావిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.. మనోభావాలను దెబ్బతీయడం, హిందూ ధర్మ శాస్త్రలను అవమానపరిచే విధంగా ప్రవర్తించి స్థానికంగా అరిష్టమని టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు.. ఈ సందర్బంగా టెక్కలి నియోజకవర్గం లోని నాలుగు మండలాల్లోని శివాలయాల్లో నందీశ్వరునికి శాంతి పూజలు జరిపించి నట్టు వైసీపీ నేతలు స్పష్టం చేశారు..
ఇది ఇలా ఉంటే.. ఈ దుశ్చర్య పై పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు..మత విద్వేషాలు సృష్టించే విధంగా ప్రజాస్వామ్యానికి భంగం కలిగే విధంగా ప్రవర్తించే వారిపై చర్యలు తప్పవని శ్రీకాకుళం జిల్లా ఎస్పి అమిత్ బర్ధార్ హెచ్చరించారు..
సంతబొమ్మాలి మండలంలో పాలేశ్వర స్వామి ఆలయ మూడు రోడ్ల జంక్షన్ జంక్షన్ వద్ద సుమారు మూడు సంవత్సరాలు క్రితం ఉంచిన సిమెంట్ దిమ్మ పై ఇటీవలె నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కుట్రలో భాగమని ఎస్పీ పేర్కొన్నారు.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆలయంలోని నంది విగ్రహాన్ని ఏటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పాటించకుండా నెలకొల్పడానిపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ అమిత్ స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలకు ఇలాంటి ఘటనలు దోహదపడుతాయని అయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగే విధంగా నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తోపాటు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయిని పేర్కొన్న జిల్లా పోలీసు బాస్ శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉన్నాయన్నారు.. సీసీ పుటేజ్ ఆధారంగా సంతబొమ్మాలి వి అర్. ఓ. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.. కేసు నమోదు చేసి సీసీ పుటేజ్ ఇతర సాక్ష్యాలు ఆధారంగా 16 మందిని గుర్తించినట్లు ఎస్పీ అమిత్