ఎం. పి. నివాసంలో పాము హల్చల్…
రామ్మోహనాయుడు నివాసంలో పాముని గ్రీన్ మెర్సీ రెస్క్యూ
సురక్షితంగా విడిచిపెట్టిన గ్రీన్ మెర్సీ టీమ్
శ్రీకాకుళం నగరంలో ఎంపీ నివాసంలో భారీ సర్పం అలజడి సృష్టించింది.. కింజరాపు రామ్మోహనాయుడు నివాసంలో అత్యంత విషపురితమైన రక్తపింజర పాము చొరబడింది… భారీ పాము భయంకరంగా బుసలు కొడుతూ ముందుకు రావడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు.. స్నేక్ రెస్క్యూ టీమ్ గ్రీన్ మెర్సీ ని సంప్రదించారు..
ఎం. పి. వ్యక్తిగత సహాయకులు లచ్చన్న, చిన్నబాబు వెంటనే విషయం గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్ కి సమాచారం ఇచ్చారు.
రెస్క్యూ బృందాలకు నేతృత్వం వహించిన గ్రీన్ మెర్సీ సీఈఓ., కె. వి.రమణ మూర్తి చాకచక్యంగా ఆ భారీ విష సర్పన్ని బంధించడం తో ఎట్టకేలకు అంతా ఉపిరి పీల్చుకున్నారు.అనంతరం సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో సురక్షితంగా పాముని విడిచిపెట్టారు..