చరిత్ర లో నిలచి పోయేలా … సీఎం జగన్ పాలన…
జగన్ పాలనలో అర్హులకు అభివృద్ధి ఫలాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో
విజయానికి మార్గం సుగమం
వైసీపీ నేత మార్పు ధర్మారావు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సువర్ణాక్షరాలతో లిఖించేలా చరిత్రలోనే రికార్డు సృష్టించబోతోందని జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు, వైసీపీ నేత మార్పు ధర్మారావు స్పష్టం చేశారు.. గార లో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో అర్హులకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్న నమ్మకం ప్రజలకు కలుగుతుందన్నారు.. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని హామీలు సైతం అమలుచేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని మార్పు కొనియాడారు.. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన సిక్కోలు గతంలో దివంగత వై ఎస్, ప్రస్తుతం సీఎం జగన్ నాయకత్వం లో మంత్రివర్యులు, మాజీ మంత్రి వర్యుల దూరద్రుష్టి తో అభివృద్ధి సాధ్యం అని మార్పు ధర్మారావు పేర్కొన్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో పంచాయితీ లలో
విజయానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు.. నేరుగా ఇంటికి పథకాలు వలంటీర్ల ద్వారా సేవలు అందటం, అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారి తనం అవినీతి రహిత పాలన ప్రజలు హర్షిస్తున్నారని మార్పు ధర్మారావు పేర్కొన్నారు.. విపక్షాలు ఎన్ని కుట్రలు చేస్తున్నా మాట తప్పకుండా ప్రజల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం కృషిచేయడం గర్విస్తున్నామని తెలిపిన వైసీపీ నేత మార్పు ధర్మారావు అన్ని వర్గాలకు, పార్టీలకు అతీతంగా పథకాలు గ్రామ సచివాలయాలు ద్వారా అందటం దేశంలోనే అందరి ప్రశంసలు అందుకుంటుందని అన్నారు.