రైలులో విధి నిర్వహణలో అందరూ మహిళలే.. ..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ డివిజన్‌కు అరుదైన ఘనత..
– కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నడిపించిన మహిళా ఉద్యోగులు..
– రైలులో విధి నిర్వహణలో అందరూ మహిళలే..
పురుషులకు దీటుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ సరిలేరు మాకెవ్వరు అంటూ నిరూపిస్తున్నారు విజయవాడ రైల్వే డివిజన్‌లోని మహిళా ఉద్యోగులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్‌లో ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్‌లో తొలిసారిగా పూర్తిగా మహిళా ఉద్యోగులతోనే ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17406) రైలును నడిపారు. లోకో పైలట్, గార్డు, టీటీఈ, స్క్వాడ్, ఆర్‌పీఎఫ్ సిబ్బంది, పాయింట్ ఉమెన్, స్టేషన్ మాస్టర్ తదితర విభాగాల్లో పూర్తిగా మహిళా ఉద్యోగులే విధులు నిర్వర్తించారు.మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా విధుల్లో ప్రతిభ చాటుతున్నారని నిరూపించుకున్నారు..
Key words : the complete train run by women.