Published On: Tue, Jan 8th, 2019

రెండు దశాబ్దాలుగా ఆదరిస్తున్న శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు చెబుతున్నట్లు బిజెపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ రొక్కం సూర్య ప్రకాశరావు

Share This
Tags

మహాకూటమి మహా మాయకూటమని, తెలంగాణ లో మహాకూటమి చిత్తుగా ఓడిందని, దీన్ని ప్రజలు నమ్మరని బిజెపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ రొక్కం సూర్య ప్రకాశరావు అన్నారు.నిధులు దారి మల్లింపు వల్లే నమ్మకాన్ని రాష్ట్రం కోల్పోయింది, కేంద్ర నిధులపై రాష్ట్రం
లెక్కలు చెప్పే పరిస్థితి కనబడటం లేదని ఎద్దేవాచేశారు..
రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేయలేదన్నారు. నిధుల విడుదలకు ఎలాంటి వివక్ష చూపడం లేదని రొక్కం స్పష్టం చేశారు.. కాపులకు అన్యాయం జరగకుండా బిజెపి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని తెలిపారు.. ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణగారి సారధ్యంలో తప్పక న్యాయం జరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు..
దేశంలో 123 ప్రత్యేక పధకాలను బీజేపీ ప్రవేశ పెట్టి అర్హులకు అభివృద్ధి ఫలాలు అందేలా పక్కా ప్రణాళికతో అమల్లోకి తెచ్చిందన్నారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో కేంద్ర పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు..
ఎపి బీజేపీ కి కన్నా లక్ష్మీనారాయణ గారి సారధ్యంలో కార్యకర్తలు నేతలు నూతన ఉత్సాహం తో పని చేస్తున్నారని సూర్య ప్రకాశరావు అన్నారు..శ్రీకాకుళం జిల్లాలోని వనరులు వున్నా వినియోగం లోకి రావడం లేదని, ఆవేదన వ్యక్తం చేసిన ఆయన శ్రీకాకుళం వెనక బడిన జిల్లా కాదని, వెనక్కి నెట్టివేయ బడిందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు జరిగి, వనరుల సద్వినియోగం జరిగితే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్న ఆయన
రెండు దశాబ్దాలుగా ఆదరిస్తున్న శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు చెబుతున్నట్లు బిజెపి రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ రొక్కం సూర్య ప్రకాశరావు తెలిపారు.

About the Author