శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు చెప్పారు…
ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు 90 శాతం అందుబాటులో ఉండి, పదవికి ప్రజలకు శతశాతం న్యాయం చేసినట్లు ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు చెప్పారు… 7 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో ఆసుపత్రిల నూతన భవనాల నిర్మాణం జరిపామని శాసనసభ్యులు డాక్టర్ అశోక్ స్పష్టం చేశారు.ఇచ్ఛాపురం మండలం ఈదుపురం రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు,9.50 కోట్ల రూపాయలతో బొడ్డబడ వంతెన నిర్మాణం,7.59 కోట్ల రూపాయలతో కళింగపట్నం వంతెన నిర్మాణం,5-50 కోట్ల రూపాయలతో బాతు పురం బ్రిడ్జి నిర్మాణం,6.19 కోట్ల రూపాయలతో ఒంటూరు- మాణిక్యపురం బ్రిడ్జి నిర్మాణం, 3.6 కోట్ల రూపాయలతో కత్తి వరం రోడ్డు నిర్మాణం ,10 కోట్ల రూపాయలతో పైడిగాం ప్రాజెక్టు అందుబాటులో కి తెచ్చినట్లు ఎమ్మెల్యే అశోక్ పేర్కొన్నారు.34.96 కోట్ల రూపాయలతో నియోజకవర్గ రైతులకు రుణమాఫీ చేశామన్నారు.ధర్మల్ విద్యుత్ 1107 జీవో రద్దు చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందని అశోక్ చెప్పారు.
1.83 కోట్ల రూపాయలతో ఇద్దివానిపాలెం నుండి కవిటి రోడ్డు,కవిటి నుండి నెలవంక సి కారిడార్ రోడ్డు నిర్మాణం,పదిహేను కోట్ల రూపాయలతో కంచిలి నుండి గాటి ముకుందపురం రోడ్, ఇచ్చాపురం నుండి కమలాయి పుట్టుగ రోడ్డు నిర్మాణం జరిగిందని తెలిపారు.మూత్రపిండాల వ్యాధి గ్రస్తులకు ఉచిత వైద్య చికిత్సలు
ఉచిత మందుల పంపిణీ చేశామని అశోక్ చెప్పారు.. కొబ్బరి రైతులకు మొక్కల పంపిణీతో పాటు రెండు కోట్ల రూపాయలతో కంచిలి నుండి బంజరి నారాయణపురం రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు
ఇచ్చాపురం,కవిటి,కంచిలి, సోంపేట మండలాల్లో అన్ని గ్రామాలకు రోడ్లు, భవనాలు,రేషన్ కార్డులు,పింఛన్లు మంజూరు చేసినట్లు ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ బాబు స్పష్టం చేశారు..గడచిన 5 సంవత్సరాలలో నన్ను ఆదరించి, అభిమానించిన, నేతలకు,అధికార అనధికార ప్రముఖులకు, అన్ని గ్రామాల్లో టిడిపి కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలకు శ్రేయోభిలాషులందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియ జేశారు..