సుందర సత్సంగం .. చరిత్రలో మార్గదర్శకం…
ఎలాంటి స్వార్ధం లేని గురువుకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం.. నిస్వార్ధ సేవలకు ప్రతిఫలం ఎలా ఇచ్చుకోగలం … తమలో మార్పు , వేదాధ్యాయనాలకు కారకులైన మార్గాదర్స కునికి ఎలా కృతఙ్ఞతలు చెప్పుకోగలం … అలాంటి శిష్య బృందానికి గురుదక్షిణ సమర్పంచు కునే అవకాశం లభించింది .ఆ మధురానుభూతి క్షణాలేమిటో ఓ సారి చూద్దాం .
ఈయన పేరు శ్రీ పెరంబదూరు సూరిబాబు.. వృత్తిరీత్యా శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకునిగా ఉన్నా .. అందరిలో ఆధ్యాత్మిక భావన పెంపొందిచి ,సన్మార్గంలో నడపాలన్న సదుద్దేస్యంతో సుందర సత్సంగం కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారు . ఆ దశలో 11 ఏళ్ళగా వేలాది మందిని సత్కార్యక్రమాల వైపు నడిపించారు . అయితే శిష్య బృందంలో ఎక్కుఅవ శాతం మహిళలు ..వీరంతా గురు దక్షిణ గా ఏమివ్వాలనుకున్నా సూరిబాబు మాష్టారు అంగికరించేవారు కాదు .. దీంతో శిష్యులందరూ గురువు భోధనలు ,ఆదేశాలు తూచా తప్పకుండా పాతిస్తున్దేవారు .. అయితే సూరిబాబు మాష్టారు కు గురుపౌర్ణమి నాడు మాత్రం గురుదక్షిణ కావాలని అడిగేవారు.. ఎంతో మందికి ఆపత్కాలంలో అవసరమై , ప్రాణాలు నిలబెట్టే రక్తదానం చేయాలని ఈయన పిలుపునిచ్చారు . దీంతో వందలాది మంది ముందుకు వస్తే అందులో ఎక్కువ శాతం మహిళలు స్వచ్చందంగా రక్తదానం చేసేవారు . శ్రీకాకుళం లో గురుపౌర్ణమి పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా 200 మంది బ్లడ్ డొనేట్ చేసి గురుదక్షిణ సమర్పించుకున్నారు .గురువుగారు సూరిబాబు మాష్టారు ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తామని ,రక్తదానం ఒక లెక్కా అంటున్నారు శిష్యులు .