Published On: Fri, Mar 6th, 2020

సరస్వతీదేవి వేదస్వరూపిణి.. వేదమే సరస్వతి..సరస్వతియే వేదం…..

Share This
Tags

సరస్వతీదేవి వేదస్వరూపిణి. వేదమే సరస్వతి, సరస్వతియే వేదం. ఒకప్పుడు ధ్యానం చేస్తున్న ఋషులకు వేదమంతా ఒక సరస్సుగా కనబడింది. వేదం ఒక సరస్సు చేసినంత పని చేస్తుంది. సరస్సు ఎలాగైతే దాహాన్ని, తాపాన్ని పోగొట్టి మన బ్రతుకు పంటలను పండిస్తుందో అలాగే జన్మజన్మల తాపత్రయాల్ని, అజ్ఞానాన్ని పోగొట్టేదే సరస్వతి. అందుకే సరస్సు రూపంతో ఋషులకు కనబడింది. వేదం అలా సరస్సుగా కనబడినప్పుడు అది చూసిన ఋషులు ఇంకా ధ్యానాన్ని కొనసాగిస్తే ఆ సరస్సు లోంచి ఒక కమలం, ఆ కమలం లోంచి సరస్వతి ప్రత్యక్షమయింది. అంటే వేదస్వరూపిణియే తాను అని వ్యక్తపరచింది. అన్ని జ్ఞానాలకి ఆధారం వేదమే. అటువంటి వేదం యొక్క స్వరూపం సరస్వతి. బుద్ధి బాగా పనిచేయాలంటే భారతి అనుగ్రహం కావాల్సిందే.సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా…

Key words : Saraswati is one of the Hindu goddesses. … She is the goddess of speech, learning and knowledge. The legend states that she created the Sanskrit language and invented the vina, a musical instrument similar to a lute. The legend also says that she is the wife of Brahma, one of the gods of the Hindus.

About the Author