మట్టి వినాయక ఆరాధనా రహస్యం…
శ్రావణమాసం వర్షారంభకాలం కాబట్టి అంతకు ముందే చెరువులు, కాలవలు, కుంటలలోని మట్టిని తీసినందువల్ల
పూడికతీత అంటూ వేరేగా చేయనవసరం లేదు. అవి బాగుపడి వర్షం పడ్డప్పుడు చక్కగా నీరు అందులో సమృద్ధిగా చేరు.
నీటి కొరత రాకుండా ఉంటుంది.
వినాయకుడాని తయారుచేసి, ఆ మట్టి విగ్రహాన్నే మరల ఆయా నీటిప్రాంతాలలో కలిపితే ఆ మట్టి తిరిగి అక్కడికే చేరి,
ఊబులవంటివి ఏర్పడకుండా చేస్తుంది…
వినాయకుడికి 21 రకములైన ఔషధీ పత్రాలతో పూజచేస్తాం కాబట్టి అవి అన్నీ ఈ కాలాలలో వచ్చే క్రిమకీటకాదులని
చంపేసి; అందులోనే నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు ప్రజలకి శుద్ధం గా ఉపయోగపడతాయి.
మనం అంతా ఇపుడు water pollution అని అనుకుంటున్నాము. వేల సం. క్రితం ద్వాపర యుగం లోనే కృష్ణ
పరమాత్మ water pollution ని ఖండించి నిర్మూలించాడు. కాళీయుడు తన ప్రాణ రక్షణకై కాళింది మడుగున దాగి, ఆపై
అచటికి వచ్చే అన్ని ప్రాణులనీ హింసించాడు. అందుకే శిక్షగా ఆ మడుగుని వదిలి ఎక్కడో ఫిజి ఐలాండ్ లో గల రామణక ద్వీపానికి
పంపేశాడు.
అంటే మన ఎవ్వరికీ భగవత్ప్రసాదితం అయిన నీటిని కాలుష్యం చేసే హక్కులేదు అని చాటిచెప్పాడు.పంచభూతాలలో ఒకటిగా చెప్పబడుతున్న నీరు ని శుద్ధి చేసే కార్యక్రమం ఆనాటినుండీ ఉంది.మట్టి వినాయకుని తయారు చేయడం లో ఆంతర్యం ఇదే.
భగవంతుడు ఆడంబరాలకి, ఆర్భాటాలకీ అందడు. కేవలం మట్టి, పత్రి మున్నగు వాటితోనే ఆనందపడే అల్పసంతోషి. నీ
శ్రద్ధ, భక్తే ముఖ్యం అని చెప్పకనే చెపుతాడు.
చెట్లనుండీ అనేకమైన పత్రాలను, కొమ్మలనూ తుంచడం ద్వారా తిరిగి అవి చక్కగా చిగురించి , చెట్లు హాయిగా , గబగబా
పెరుగుతాయి అని కూడా అనుకోవచ్చు. ఓ విధమైన వృక్ష సంరక్షణే
నీటికీ, భూమికీ కూడా కలిపి పూజ చేయడమే ఇది. ఎందుకంటే జీవకోటి బ్రతకాలంటే ఇవి కూడా ముఖ్యమైన
పంచభూతాలలో ఒకటి.అగ్ని ఉందంటే దాన్ని శుద్ధి ఎలా మనం చేయగలం? చేయలేమే.అదే వాయువు దగ్గరకి వచ్చేటప్పటికి భూమి, నీరు శుభ్రపడి, చెట్లు, చేమలు బాగుంటే ప్రత్యేకంగా ఏదీ చేయకుండానే వాయువు శుద్ధి చేయబడుతుంది. దీని ద్వారా అగ్ని కూడా సుద్ది చెందుతుంది ….
ఇక ఆకాశం దగ్గరకి వచ్చినా ఇవన్ని దానికి వర్తంచి ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది. ఇలా పంచభూతాలు చక్కగా ఉంటే జీవకోటి అంతా *స్వచ్ఛంగా, సంతోషంగా బ్రతుకుతారు.
ఓ పండగ సాధారణంగా ఇంటిలో చేసుకుంటాం. లేదా బంధువులతో కలిపి చేస్తాం సంక్రాంతి లా. ది మనం , మన
కుటుంబ సభ్యులం అన్నంతవరకే పరిమితం.
అదే వినాయకచవితి అనేది ఎక్కువగా పందిళ్ళల్లో చేస్తారు. ఎందుకు అంటే మనలో సమైక్య భావం పెరగాలి అని.
తరతమభేదాలు మరచి, ఓ కార్యక్రమం జరగాలి అంటే సమాజంలోని అన్ని వర్గాలవారు కలిసి నడిస్తేనే సాధ్యం.పూజ తరువాత ప్రసాదాలు పంచడం ద్వారా కొద్దిమేర అన్నార్తులని ఆదుకొనే ప్రయత్నం చేద్దాం ఆపై ఆనందంగా,ఆడుతూ , పాడుతూ వినాయకుని, తిరిగి నీటిలో నిమజ్జనం చేసి, మరల వినాయకచవితి దాకా ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ జరిగిన లోపాలని సవరించుకుంటూ సమాజం పట్ల మనకి గల బాధ్యతని నెరవేర్చడం. అందరిని సమాదరించడం. అందుకు మన పెద్దలు ఇవన్నీ ఆలోచించి మట్టివినాయకుడికి పూజలు చేయండి అని ఇన్ని గొప్పగొప్ప మాటలు మనకి అందించారు, ఇవి మనల్ని కుడా ఆచరించి భవిష్యత్తులో తరతరాలకి అందించామన్నారు…
—-జె.ఎస్. శైలజ