ప్రార్ధించే పెదవుల కన్నా.. సేవ చేసే చేతులు మిన్న..
ప్రార్ధించే పెదవుల కన్నా.. సేవ చేసే చేతులు మిన్న.. అన్న చందంగా ఎంతోమంది స్ఫూర్తి నింపేవిధంగా సంస్థను నడిపించడమే కాదు.. వేలాదిమందికి అక్కున చేర్చుకోగలుగుతోంది.. ఎవరు తోడ్పాటు అందించినా.. అందించకపోయినా కష్టసుఖాలను దిగమింగుకుని శరణ్య మనోవికాస కేంద్రం దశాబ్దాలుగా నిస్వార్ధ సేవలతో మార్గదర్శకంగా ముందుకునడుస్తోంది. ఒక మహిళ.. అన్నీ తానై.. దివ్యాంగుల సేవలలో దాదాపు రెండు దశాబ్దాలుగా.. అనిర్వచనీయమైన ఫలితం రాబట్టగలిగిన విశ్వాసం సొంతం చేసుకోగలిగారు.. ఈమె పేరు యండ.శ్రీదేవి.. భర్త ప్రభుత్వ ఉద్యోగి.. ముగ్గురు పిల్లలతో మంచి గృహిణిగా జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో తన తండ్రి రాములు 1999లో స్థాపించిన సుమిత్ర మహిళా వెల్ఫేర్ సొసైటీని ఈమె 2002సంవత్సరం నుండి తన భుజస్కంధాలపై వేసుకున్నారు. శరణ్య మనోవికాస కేంద్రం వివరాలకై ఈ వీడియోని వీక్షించండి..