అభివృద్ధిలో భాగస్వామ్యం.. సంక్షేమ కార్యక్రమాలు అమలులో సమన్వయము.. కలబోసి ప్రస్తుతం గార మండలం శాలిహుండం గ్రామ పంచాయితీ ఆదర్శంగా ముందుకెళ్తోంది..
అభివృద్ధిలో భాగస్వామ్యం.. సంక్షేమ కార్యక్రమాలు అమలులో సమన్వయము.. కలబోసి ప్రస్తుతం గార మండలం శాలిహుండం గ్రామ పంచాయితీ ఆదర్శంగా ముందుకెళ్తోంది..
రెండుసార్లు ఎంపిటిసి గా నిబద్ధతతో సేవలందించిన యువకుడైన కొంక్యాన ఆదినారాయణ ను ఏకగ్రీవంగా శాలిహుండం గ్రామపంచాయితీ కి సర్పంచ్ గా ఎన్నుకొన్నారు.. 2250 పైచిలుకు జనాభా, 1920 మంది ఓటర్లు ఉన్న ఈ శాలిహుండం గ్రామపంచాయితీని ఆదినారాయణ 2013 నుండి అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు.. గతంలో రెండు పర్యాయాలు ఎంపిటిసి గా సేవలందించిన అనుభవం, ప్రజల విశ్వాసం, ప్రజాప్రతినిధులు, అధికారుల సంపూర్ణ సహయ సహకారం వెరశి ఆదినారాయణ శాలిహుండం గ్రామపంచాయితీ పరిధిలోని పది వార్డులలో గల శాలిహుండం, ఎస్.కొత్తపేట, వేణుగోపాలపురం, తంగుళ్ల పేట, కొంక్యాణపేట, చిన్న బోరవానిపేట ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు కొంక్యాన ఆదినారాయణ నడుం బిగించారు. ఆ వివరాలకై ఈ వీడియో క్లిక్ చెయ్యండి..