మూడు దశాబ్దాల మార్గదర్శకం.. రెండు తరాల సేవా దృక్పధం..
మూడు దశాబ్దాల మార్గదర్శకం..
రెండు తరాల సేవా దృక్పధం..
ఒక కుటుంబం మీద ప్రజల నమ్మకం..
వెరసి పల్లె నుండి జిల్లా స్థాయి వరకూ ఆత్మీయతా అనుబంధాలను సంపాదించుకుంటోంది ఆ కుటుంబం..
మౌలిక సదుపాయాల కల్పనతో అగ్రభాగాన నిలుస్తోంది ఆ ప్రాంతం.. రాజకీయ సామాజిక రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు జనం.. తండ్రి గొండు జగన్నాధం ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షునిగా, కుమారుడు గొండు శంకర్ స్థానిక ఎంపీటిసిగా.. శంకర్ భార్య స్వాతి క్రిష్టప్పపేట గ్రామ సర్పంచ్ గా.. సేవలందించగలుగుతున్నారు. వీరి హయాంలోనే కాదు.. గడచిన ముప్పై అయిదు సంవత్సరాలుగా ఇలాంటి పదవులెన్నో గొండు జగన్నాధం కుటుంబం నిక్కచ్చి పాలనతో నిజాయితీగా సేవలందిస్తోంది. ఇక శ్రీకాకుళం రూరల్ మండలం లోని సింగుపురం, క్రిష్టప్పపేట ఎంపీటిసి, సర్పంచ్ శంకర్, స్వాతిలు సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తూ ఆదర్శవంతంగా పంచాయతీని తీర్చిదిద్దుతున్నారు. ఆ వివరాలకై ఈ వీడియో క్లిక్ చెయ్యండి..