Published On: Fri, Jan 13th, 2017

ధర్మపీఠం…..?? దద్దరిల్లింది…

Share This
Tags

ధర్మపీఠం…..?? దద్దరిల్లింది…

పాఠకులకు నమస్కారం…..

వివేకానందుని జయంతి అంటే:
“జాతీయ యువజన దినోత్సవం” ….
రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుని సమయస్పూర్తికి ఒక చిన్న ఉదాహరణ:
హైందవం అంటే మతం కాదు అది ఒక ధర్మం .
మహా గురువు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వివేకానందుని పూర్వ నామం “నరేంద్ర నాధుడు”.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేసి వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములను సమాజానికి అందించారు. హిందూతత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే చిరకాలంగా నిలిచిపోయే మహోన్నత ఆధ్యాత్మిక నాయకుడు. “రామకృష్ణమఠ” వ్యవస్థాపకుడు.
తన భావాలను సమాజానికి పంచి మేల్కొలిపిన మహానుభావుడు.
తన ప్రసంగాలతో భారతదేశాన్ని జాగృతము చేశారు.
అంతేకాదు విదేశాలలో సైతం తన ఉపన్యాసములతో జీవిత పరమార్థాన్ని బోధించారు.
హిందూధర్మ ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు.
ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది.
ఎంతో మంది ఆయన శిష్యులయ్యారు.
పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.
తన గురువు రామకృష్ణుడు నేర్పిన ‘జీవుడే దేవుడు’ అనేది వివేకానందుని మంత్రముగా మారింది. ‘దరిద్ర నారాయణ సేవ’ ఆ భగవంతునికి చేసే సేవతో సమానమన్నారు.
విశ్వమంతా బ్రహ్మం నిండి ఉందనీ, హెచ్చు తగ్గులు లేవనీ చాటారు.
అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వాన్ని చాటిచెప్పారు.
ఇలా హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపచేసిన వివేకానందుడు…
విదేశాలలో పర్యటనలు ముగించుకుని మన దేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించారు.
దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు.
అయితే దురదృష్టవశాత్తూ 39 ఏళ్ళ వయసులోనే పరమపదించారు.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని
“జాతీయ యువజన దినోత్సవం”
గా ప్రకటించింది.

స్వామీ వివేకానంద చెప్పిన ఒక గొప్ప వాక్యం:
‘‘ఒక వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు.
తాను బలహీనుడినని భావిస్తే బలహీనుడే అవుతాడు,
బలవంతుడిని అని భావిస్తే బలవంతుడే అవుతాడు, కార్యసాధన యత్నంలో ఎదురయ్యే ఆటంకాలను, పొరపాట్లను లెక్కపెట్టకూడదు.
ఓటమిని లెక్క చేయకూడదు.
తిరోగమనాలనూ సహించాలి.
లక్ష్యసాధన కోసం వెయ్యి ప్రయత్నాలైనా చేయాల్సిందే. అప్పటికీ ఫలించకపోతే మరో ప్రయత్నానికి సిద్ధం కావాలి”.

అసలు ఈరోజు గొప్పతనం ఏమిటి? మనిషి ఎలా నడుచుకోవాలి, చెప్పటం కన్నా జీవితంలో నడిపించి చూపించిన ఒక గొప్ప మార్గదర్శి గురించి చర్చించు కోవడానికి ఒక వేదికని విశాఖ జిల్లా లో ఏర్పాటు చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను,
ఎంతలా అంటే ఆ వేదికపై ప్రముఖులు రాబోతున్నారు కదా నాకున్న సందేహాలను నివృత్తి చేసుకొనే అవకాశం దొరిగింది కదా అని ఉబ్బి తబ్బిబ్బైపోయాను. అసలు ముందుగా చెప్పుకోవాలంటే జ్ఞ్యానం అంటే ఏమిటి? నిజమైన జ్ఞానం కోసం అన్వేషించడానికి ఒక నరేంద్రుడు తన చిన్నతనం నుంచే ఎలా అన్వేషణ సాగించాడు ?
ఎంతమంది జ్ఞానులని కలిసినా సంతృప్తి చెందని అతని మనసుని ఒక రామకృష్ణ పరమహంస లాంటి గురువుని ఆధారం గా ఎంచుకొని ఎలా ముందుకు పయనమయ్యారో మీరు విశాఖ జిల్లాలో “12 జనవరి 2017” న చేపట్టిన “Youth Icon Awards” కార్యక్రమం లో పెద్దల మాటలలో తెలియజేస్తే వినాలని ఎంతో
కుతూహలంతో ఎదురు చూస్తూ కూర్చున్నా. కానీ నిర్వాహకులు చెప్పింది ఒకటి అక్కడ చేసింది ఒకటి.

ఇన్ని అద్భుతమైన సంఘటనలు చోటుచేసుకోవాల్సిన వేదిక మీద జరిగినవి ఏమిటో ఒకసారి చూద్దాం:
1) పెద్దలు వచ్చి ఆసీనులు అయ్యాక, వారి ముందు బూటు కాళ్ళతో, చెప్పులతో ప్రార్ధన గీతములు పాడటం.
2) పిచ్చి చేష్టలతో వెకిలి భాష తో anchoring నిర్వహించడం, అలాంటి గురువుల ముందు ఎంతో పొందికగా, సంప్రదాయ బద్ధం గా ఉండాలిగానీ, ఏంటి ఆ వ్యాఖ్యానం ఏంటి ఆ కార్యక్రమం?
3) అంతటి పెద్దలు పాదరక్షలు లేకుండా సభ కు విచ్చేసి వేదిక మీదకు వస్తే, మీరు ఎంచిన గాయకులూ, వ్యాఖ్యాతలు మాత్రం చెప్పు కాళ్ళతో అంత పవిత్రమైన వేదికను అవమానించడం..ఇది మీరు తీర్చిదిద్దే సంస్కారవంతమైన భారత్. ఇది మీరు యువత కు విద్యార్థుల కి నేర్పించే నైతిక విలువలు.
4) అలాంటి పీఠాధిపతులముందు గురువులముందు మీరు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటంటే “నైనో మే సప్నా” లాంటి మాస్ పాటలకి డాన్స్ లు చేయించడం, “నా చెలి రోజావే” అంటూ మరియు bollywood love songs ని medley గా perform చెయ్యడం..దీనిని యువతేజం అంటారా?
5) తెలుగు భాష సరిగ్గా మాట్లాడలేనివారు, ‘ళ’ కి ‘ల’ కి తేడా తెలియనివారు, భారత్ అని ‘భ’ కి వొత్తు పలకకుండా “బారత్” అనేవారు వ్యాఖ్యాతలు. కార్యక్రమం స్వామీ వివేకానంద గురించి ఐతే, కనీసం వివేకానందుడు గురించి నాలుగు ముక్కలు సరిగ్గా తెలియని వారు అయన గురించి మాట్లాడటం.
కనీసం అయన పుట్టిన తేదీ సరిగ్గా చెప్పలేని వారు వ్యాఖ్యాతలు. ఆయన చికాగో లో ప్రసంగించింది 1893 ఐతే, 1983 లో ప్రసంగించారు అని చెప్తున్నారు.
audience come on come on అని గావు కేకలు పెట్టడం, అంతటి మహనీయుల ముందు “ఏంది బయీ చప్పట్లు వినిపించట్లే, సప్పుడు సెయ్యండ్రి” అని వ్యంగ్యం గా వ్యాఖ్యానించడం .
6) మీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారు పరిపూర్ణనానంద స్వామీ వారిని ఎదురుగా పెట్టుకుని యువత ను inspire చేసేలాగ ఏం motivational స్పీచ్ ఇచ్చారో తెలీదు గానీ, అది విన్న చాలామందికి బీపీలు, గుండె నొప్పులు, చెవిపేలుళ్లు వచ్చాయి. వారికంటే యుత్ ని ఈయన inspire చెయ్యగలరా?

* పాపం పరిపూర్ణానంద స్వామి ని focus చేస్తుంటే ఆ వెకిలి చేష్టలు చూడలేక ఆయన కన్నుల్లో వేదన వెలువడింది. పరమేశ్వర ఇదా భారత్ యొక్క గొప్పదనం, ఇదా నా దేశపు యువత యొక్క స్ఫూర్తి అని ఆయన కన్నుల్లో ఆవేదన కనపడింది.
“నాడు వివేకానంద నేడు పరిపూర్ణానంద” అన్నారు. ఆయన ఒక “youth icon” అన్నారు. మరి ఏంటి ఆయన ద్వారా మీరు నేటి మహదినాన యువత కు ఇచ్చే సందేశం?
అంతటి గురు స్థానం లో ఉన్న వ్యక్తి కి సంకెళ్లు కట్టేసినట్టు ఆలా కుర్చోపెట్టేసి, ఆయన ముందు కుప్పి గంతులు, అర్ధం -పర్ధం లేని వ్యాఖ్యానములు ఆ కార్యక్రమం లో హైలైట్స్ గా నిలిచాయి.
What the hell was happening there? Was it a “Yuva Sankalp Divas” or a function organized for the publicity of your channel?

*నిజం గా మీ సంకల్పం పరిపూర్ణానంద సరస్వతీ స్వామివారు యువత తో సంభాషించడమే ఐతే, జ్యోతి ప్రజ్వలన గావించగానే వారిని వేదిక మీదకు ఆహ్వానించి అసలు వివేకానంద అంటే ఏమిటి, అయన ను చూసి నేటి భారతీయ యువత ఏం నేర్చుకోవాలి, ఈ దేశమును అభివృద్ధి పరచడం లో వారు ఎటువంటి బాధ్యత తీసుకోవాలి,
ఎటువంటి విధి నిర్వహణలు చెయ్యాలి, రేపటి భారత పౌరులుగా చెయ్యి చెయ్యి కలిపి ఎలా ముందుకు అడుగెయ్యాలి అనే దానిమీద ఆ గురుమూర్తి చేత ప్రసంగింపజేసి, ఆ తరువాత విద్యార్థులు కి ఆయన తో చర్చించే అవకాశం కల్పించి,
వారిని students ప్రశ్నలు వేసి వారి సందేహములను నివృత్తి చేస్కునే ఆవకాశం కల్పించి ఉంటే, నిజం గా మీరు మీ కార్యక్రమానికి పెట్టిన పేరు కి ఒక సార్ధకత వచ్చేది.

*ఇంత చెత్త పాటలు మరియు గోలలకి వెచ్చించే సమయం లో కొంతసమయమైనా గురువుగారితో కొన్ని చక్కటి మాటలు మాట్లాడించే ప్రయత్నం చేశారా ?
పోనీ తొక్కిసలాటే అవుతుందని అనుకుందాం. అటువంటప్పుడు విద్యార్థులకు ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవడం కొరకు ప్రశ్నలన్నీ వాళ్ళ తరపున మీ యాంకర్ అడగ వచ్చు కదా!!
నాలాంటి ఎందరో విద్యార్థిని-విద్యార్థులు ఆయన తో మాట్లాడాలని, మా సందేహములను నివృత్తి చేసుకోవాలని ఏంతో ఉత్సాహంతో పాలుపంచుకోడానికి వచ్చాము . కానీ ఆ పిచ్చి గోల భరించలేక నిరాశ చెంది వెనుతిరిగాం. మాకే అంత వేదన కలిగితే, గురుతుల్యులు వారికి ఎంత వేదన కలిగి ఉంటుందో ఆలోచించండి.

*వారిని ముఖ్య అతిధి గా ఆహ్వానించారు గాని ఈ కార్యక్రమం లో ఆ స్థాయి కి చెందిన వ్యక్తి కి లభించాల్సిన గౌరవాన్ని మాత్రం మీరు వారికి ఇవ్వలేదు. మీరు పైగా ఒక గురువుని ఎదురుగా కూర్చో బెట్టి గురువుగారిని ప్రార్థిస్తూ ఆయన అమూల్యమైన సందేశాలు వింటూ మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాల్సింది పోయి చేసినది ఏమిటి?
గురువుని ఎదురుగా పెట్టుకొని ఆయన్ని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించటమా ? అది అలంటి గురువుకి ఎంతో అవమానకరం మరియు బాధాకరం.
*వారి పేరు ని అడ్డం పెట్టుకుని మీరు మీ publicity కోసం వారిని ఒక అసమంజస స్థితి లో కూర్చోబెట్టారు. ఇది మీకు మీ ఛానల్ కి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అలాంటి మహత్తర కార్యక్రమం చెప్పట్టాలంటే ఏంతో అంకిత భావం మరియు కృషి అవసరం.

* మీరు కొన్ని ముందు జాగ్రత్తలు పాటించి ఉంటే చాలా హుందా గా ఉండేది:
– ఆ event జరిగే ఒకటి-రెండు రోజులు ముందర ఆ సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించి, ఎవరి ముందు perform చేస్తున్నామో అని అలోచించి, అటువంటి వారిముందు ఇలాంటివి చేస్తే మర్యాద గా ఉంటుందో ఉండదో అనే అవగాహన తో నిర్ణయం తీసుకోవాలి…
కనీసం ఇక పై మీరు అటువంటి వారిని ఆహ్వానిస్తుంటే ఈ జాగ్రత్తలను పాటించండి. మన తెలుగు భాష ను చక్కగా మాట్లాడగలిగే వారిని ఎన్నుకుని వ్యాఖ్యాతలు గా పెట్టండి. భాష ను అగౌరవ పరిచి వొళ్ళుమరవకుండా పెద్దల ముందు ఒళ్ళు దగ్గరపెట్టుకుని నడుచుకునేవాళ్లను ఎన్నుకోండి.
అది నిజం గా మీరు ఈ దేశానికీ కలిగించే అసలైన హృదయ స్పందన, అసలు సిసలైన సాంస్కృతిక భారత్.

Please do remember that you are organizing a program that is bound by some ethics and social morality. Please make sure that you keep all those precautionary measures in mind when you are inviting
such people who are highly qualified both intellectually and spiritually. Your channel is a culture preserving channel. Let it be pure and traditional.. Please don’t make it commercial and please
do not perform such acts in front of such spiritual gurus. Try to learn the difference between a Cinema Audio Release Function and A Spiritual Event that has been taken up for the
betterment of the society. It is highly appreciable that you gave away the “Youth Icon Awards” to the deserving candidates. Atleast you could have made them speak of their achievements and their
experiences.
Students in Netherlands are reading Bhagavadgeetha as one of their subjects everyday. Instead of commercializing your channel, why don’t you people take an initiative to urge the government
to make it as a subject along with Quran and Bible?? It’s not about a religion or any community. It’s all about the ethics and moral values that we inherit from it and implement them in life.
Every citizen in our country should be taught to respect other religions and lead a harmonious life. We expected such things would be taught n your event. But all in vain.
It is highly disappointing. Try to take up such good educational agendas. Instead of functioning as a commercial channel, start functioning as a spiritual channel.
Paripoornanda Swami Ji is an excellent spiritual guru. Don’t include him in your commercial issues. Try to learn something from him and try to take his suggestions and try to make amendments.

Thank you
JAI BHAARAT

– శ్రీవిద్య

About the Author