Published On: Mon, Mar 2nd, 2020

ట్విట్టర్ లో దూసుకుపోతున్న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’

Share This
Tags

పవన్ కల్యాణ్ కొత్త చిత్రం వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్
పవన్ లుక్ కు నీరాజనాలు పలుకుతున్న అభిమానులు
వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో మూడో స్థానం
లక్షల్లో ట్వీట్లు, రీట్వీట్లు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం ఫస్ట్ లుక్ ట్విట్టర్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. పీఎస్ పీకే 26, వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్ లతో రిలీజైన ఈ ఫస్ట్ లుక్ కు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. రెండేళ్ల తర్వాత పవన్ మళ్లీ మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమానే అంగీకరించారు.

ఇది బాలీవుడ్ సినిమా ‘పింక్’ కు రీమేక్. అందులో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ చేస్తున్నారు. ఈ సాయంత్రం ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ రిలీజైందో లేదో అభిమానులు ట్విట్టర్ లో దండయాత్ర చేస్తున్నారా అనేస్థాయిలో విజృంభించారు. ట్వీట్లు, రీట్వీట్లతో మోత మోగిస్తున్నారు. ఆఖరికి పొలిటికల్ విభాగంలో కూడా లక్షల్లో ట్వీట్లతో ఈ సినిమా ట్రెండింగ్ లో ఉండడం పవన్ స్టామినాకు నిదర్శనం అని చెప్పాలి.

About the Author