Published On: Thu, Jul 17th, 2014

స్విస్ బ్యాంక్ అకౌంట్లలో లక్ష కోట్ల నల్లధనం..!

Share This
Tags

లక్షకోట్లు అంటే దాదాపు ఒక చిన్న రాష్ట్రం వార్షిక బడ్జెట్ తో సమానం. ఇంత పెద్ద మొత్తంలో నల్లధనం స్విస్ బ్యాంకు అకౌంట్లలో మూలుగుతున్న వివరాలు ఐటీ అధికారుల దాడుల్లో బయటపడుతున్నాయి. అక్రమ మార్గాల్లో కూడ బెట్టిన సొమ్మునంతా బడా బాబులు స్విస్‌ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. దోచుకున్న సొత్తునంతా సరిహద్దులు దాటించి అమాయకుల్లా నటిస్తున్నారు. లక్షల కోట్ల నల్లధనం నిజస్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన బ్లాక్‌మనీ లెక్క తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
ఆదాయ పన్ను శాఖ తనికీల్లో బయట పడుతున్న బండారాలు..
దేశ వ్యాప్తంగా ఆదాయపుపన్ను శాఖ జరిపిన తనిఖీల్లో మొత్తం 10వేల 791 కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. సర్వే ఆపరేషన్లలో 90 వేల 390 కోట్ల రూపాయలకు పైగా వివరాలు లభించాయి. కాగా పన్ను ఎగవేతను అడ్డుకోవటంలో భాగంగా వ్యక్తులు,వ్యాపార సంస్ధలు, కార్పోరేట్లు, ఇతర ఆర్థిక సంస్ధలపై ఐటీ అధికారులు దాడులు జరిపినప్పుడు ఈ వివరాలు తెలిశాయి.
మూడు రెట్లు పెరిగిన బ్లాక్‌మనీ..
2013-2014 ఆర్ధిక సంవత్సరంలో గుర్తించిన లక్ష కోట్లకు పైగా నల్లధనంలో 71వేల 195 కోట్లు విద్యుత్ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఒకే సంస్ధకు చెందినవి. ఈ లక్ష కోట్ల నల్ల ధనం 2012-13 ఆర్ధిక సంవత్సరంలో ఐటీ శాఖ గుర్తించిన మొత్తంతో పోల్చుకుంటే ఇది 3 రెట్లు అధికం. సోదాల్లో ఐటీ అధికారులు 810 కోట్లు విలువ చేసే ఆభరణాలతో పాటు FDలు కూడా స్వాధీనం చేసుకోవడాన్ని చూస్తే చట్టంలోని లొసుగులను అక్రమార్కులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అయితే తాము అధికారంలోకి వస్తే నల్లదనాన్ని వెనక్కి రప్పిస్తాం అని ప్రగల్భాలు పలికిన మోడీ సర్కార్ నేడు ఏం చేస్తోంది. కనీసం బడ్జెట్ నల్లధనాన్ని నామమాత్రంగా కూడా ప్రస్తావించకుండా తప్పించుకుని ఎంత కాలం తిరుగుతుందో చూడాలి..

About the Author