కార్పొరేట్ ఫీ’జులుం’…
మీ పిల్లలూ స్కూల్‌కు వెళ్తున్నారా? చిన్నారులు ప్రయోజకులు కావాలనేది మీ తపనా? ఇంగ్లీష్ మీడియంలో చదువులు బెటర్ అనుకుంటున్నారా? ఎల్‌కేజీ నుంచే ఐఐటీ ఫౌండేషనా? మెడిసిన్, ఇంజనీరింగ్‌పై ప్రత్యేక శ్రద్ధా? పిల్లల చదువుల కోసమే లక్షలు వెచ్చిస్తున్నారా? ప్రతీ వస్తువుకు ఎమ్మార్పీ రేటు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో విద్యావ్యవస్థలు ఎందుకు పాటించడం లేదు? పేదలు సైతం చదువును కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తోంది ? చట్టాలు ఏం చెబుతున్నాయి.. పాలకులు ఏం చేస్తున్నారు? కార్పొరేట్ ఫీజులుంపై ప్రత్యేక కథనం..
ప్రైవేటు విద్య పక్కా కమర్షియల్..
ప్రైవేటు విద్య పక్కా కమర్షియల్ గా మారింది. లాభార్జనే ధ్యేయంగా, ఫక్తు వ్యాపార ధోరణితో నడుస్తున్న విద్యా సంస్థలు భారీ వ్యాపారాలకే తెరలేపాయి. తల్లిదండ్రులకు తీరని నష్టాన్ని, ఒత్తిడిని మిగులుస్తున్నాయి. ప్రాధమిక విద్యపై చట్టాలు ఏం చెబుతున్నాయి. జీవోల్లో ఏం ఉంది. అధికారులు ఏం చేస్తున్నారు. కార్పొరేట్ యాజమాన్యాలు అడిగే వాళ్లు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఫీజుల్ని వసూలు చేస్తూ విద్యాహక్కు చట్టానికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్నాయి. విద్య వ్యాపారంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎల్కేజీకి 7 లక్షల ఫీజులా అంటూ మండిపడింది. వన్ టైం ఫీజుపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.
వన్ టైం ఫీ అంటే ఏమిటి.?..
వన్ టైం ఫీ అంటే ఏమిటి.? విద్యాసంస్థల దోపిడీకి అంతం లేదా.? సర్కారీ స్కూళ్లకు పూర్వ వైభవం వచ్చేది ఎలా.? కార్పొరేట్ మాయలోంచి సామ్యాన్యుడు బయటపడటం సాధ్యమేనా. ? ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? అధికారులు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకవడం లేదు..? నిబంధనలు పాటించాలని హుకుం జారీ చేయడం తప్ప ఆచరణలో ఎందుకు పెట్టడం లేదు..? కోర్టులు మొట్టి కాయలు వేస్తున్నా సర్కారులో ఎందుకు చలనం రావడం లేదు.
రెండు విద్యా సంస్థలదే గుత్తాధిపత్యం…
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి, రెండు విద్యా సంస్థలదే గుత్తాధిపత్యం. ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఈ సంస్థలు ప్రభావితం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాయంటే పాలకుల చిత్తశుద్ధి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. తాము ఎన్ని కష్టాలు పడ్డా.. పిల్లలకు బంగారు భవిత ఇవ్వాలనుకుంటారు తల్లిదండ్రులు. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకునే కార్పొరేట్ స్కూళ్లకు సర్కారు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్కారీ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచితే.. కొంతలో కొంతైనా పేదలకు మేలు జరుగుతుంది.
Key Words: Corporate colleges and about corporate education