ప్రధాని ప్రయాణానికి సొరంగ మార్గం సిద్ధం!
ప్రధాన మంత్రిగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన మోడీ ప్రయాణం సాఫీగా కొనసాగేందుకు సొరంగ మార్గం సిద్ధమైంది. చిన్నా చితక పనులు తప్పా ఈ టన్నెల్ పూనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక.. ఈ సొరంగ మార్గం ప్రారంభమైతే.. ప్రధాని ఎలాంటి ఆటంకం లేకుండా రయ్‌మని టన్నెల్‌లో దూసుకుపోవచ్చు.. ఇంతకీ ఆ టన్నెల్ కథేంటో ఓసారి చూద్దాం..!
ఢిల్లీలో ప్రత్యేకంగా నిర్మాణం…
ఇంతకూ ఈ సొరంగాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారనేనా మీ డౌటు..? దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ప్రయాణం కోసం స్పెషల్‌గా టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. రాజధానిలో పీఎం తరుచూ తన కాన్వాయ్‌తో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం అయిపోతున్నాయి. వాహనాలను గంటలకొద్దీ ఆపేయాల్సి వస్తోంది. ఇది అటు ప్రధానికి, ఇటు ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారింది. మరోపక్క భద్రతా ఏర్పాట్లు కూడా క్లిష్టంగా మారాయి. ఈ రెండు సమస్యలకు సొల్యూషన్‌గా సొరంగం నిర్మాణానికి పూనుకున్నారు.
ప్రధాని నివాసం నుంచి సొరంగ పనులు ప్రారంభం…
ప్రధాని నివాసం నుంచి సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం వరకు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. నాలుగేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. టన్నెల్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రధాని కార్యాలయం, పార్లమెంట్ మినహాయించి వేరే ఎక్కడికి వెళ్లాలన్నా ఈ సొరంగ మార్గంలో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. దీంతో ఇటు ప్రజలకు, అటు ప్రధానికి అవస్థలు తప్పనున్నాయి.