ఆన్ లైన్ లోనే మహిళల ఫిర్యాదులు..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడి మహిళల భద్రత కోసం మరో అడుగుముందుకేసింది. మహిళలు తమకేదైనా సమస్యలు ఎదురైతే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లే పనిలేకుండా ఆన్ లైన్ లోనే ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ సైట్ ప్రారంభించి పదిరోజులైనా కాకుండా, అశేష సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. కాకపోతే బాధితులు తప్పనిసరిగా తమ ఫోటో పంపాలి. వీడియో రూపంలో ఫిర్యాదు చేసి అప్ లోడ్ చేయాలి. ఈ ఫిర్యాదును వారి వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదులోని అంశాలను నిర్ధారణ చేసుకున్నాకే కేసుకు సంబంధించి ముందడుగు వేస్తారు.