సక్సెస్ ఫుల్ పెర్సనాలిటీ….కేంద్ర మంత్రి కృపారాణి…
ఈమె పేరు డాక్టర్ కిల్లి కృపారాణి….కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,కమ్యునికేషన్ల శాఖ సహాయమంత్రి …. చాలామందికి పదవులు వన్నెతెస్తాయి…. ఈమె మాత్రం పదవులకు వన్నె తెచ్చారనడం లో ఎలాంటి సందేహం లేదు …. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందినా ఈమె జిల్లా కాంగ్రెస్స్ అద్యక్షురాలుగా, 2009 లో శ్రీకాకుళం పార్లమెంటరి నియోజకవర్గ ఎం.పి గా గెలిచి తనదైన శైలిలో సేవలు అందించారు ….లేడి లీడర్ గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన డాక్టర్ కిల్లి క్రుపారాణి కి కాంగ్రెస్ అధిష్టానం సైతం గుర్తించింది… గత ఏడాది జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో క్రుపారాణికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,కమ్యునికేషన్ల శాఖ సహాయమంత్రి పదవి ని కట్టబెట్టింది …. కేంద్ర మంత్రి పదవి ని సవాల్ గా తీసుకున్న ఈమె తమ శాఖ కు వన్నె తెచ్చింది …. ముఖ్యంగా సిక్కోలు జిల్లా కు క్రుపారాణి పదవి భాద్యతలు వరంగా మారాయి … ఇటీవలే క్రుపారాణి చేపట్టిన రాహుల్ సంకల్ప యాత్ర కాంగ్రెస్ పార్టీ కి ఆయా ప్రాంతాల్లోమంచి మైలేజీ ని తెచ్చిపెట్టింది …. ఇచ్చాపురం నియోజకవర్గం లో ఇచ్చాపురం, కంచిలి, సోంపేట,మండలాలలో రాహుల్ సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తి చేసిన క్రుపారాణి అన్ని మండలాలలో కార్యక్రమాల నిర్వహణకు నడుం బిగించారు …. ప్రతీ వ్యక్తి విజయం వెనుక ఎవరో ఒకరు ఉన్నట్లే ఈమె సక్సెస్ వెనుక భర్త డాక్టర్ రామ్మోహన్ రావు కృషి కూడా ఎంతో వుంది…. ఎం .పి .గా ,కేంద్ర మంత్రి గా పదవులకు వన్నె తెచ్చ్గిన కిల్లి క్రుపారాణి కి ఈ రాష్ట్రం డాట్ కాం ‘సక్సెస్స్ ఫుల్ పెర్సనాలిటీ ‘గా ప్రకటిస్తోంది …. డాక్టర్ కిల్లి క్రుపారాణి జీవిత విశేషాలు , లైఫ్ స్టైల్ … మరిన్ని చిత్త్రాలు మీ కోసం …….