బంగారం గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అవుతారు…
బంగారం గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అవుతారు…
ఈ రోజుల్లో బంగారం కొంటె కొరివి అమ్మితే అడవి అన్నట్టు ఉంది. రోజు రోజుకు పెరిగిపోయే బంగారం ఖరీదు ఒక ఆశ్చర్యం అయితే, బంగారం షాప్ లలో పెరిగిపోయే జనం ఇంకొక ఆశ్చర్యం. డబ్బులు కొంచెం ఉంటే చాలు గుర్తుకు వచ్చేది బంగారమే. ఒక మనిషిని పొగడాలంటే బంగారం లాంటి మనిషని అంటాము. పూర్వం నలుగు మనగురించి గోప్పగా చెప్పుకోవాలంటే నలుగురు పేదలకు దానం చేయాలి. కాని ఇప్పుడు నాలుగు రకాల బంగారు ఆభరణాలు వేసుకుని వెళ్తే చాలు ఇక వాళ్లకు ఉన్న మర్యాదే వేరు. ఇక ఆడవాళ్ళు బంగారానికి ఎంత తాపత్రయ పడతారో చెప్పనక్కరలేదు. ఇంతలా అతుక్కుపోయిన ఈ బంగారం అసలు ఎందుకు ధరించాలో తెలుసా..? మన పూర్వీకుల నుంచి బంగారానికి ఒక విశిష్ట స్థానం కల్పించడం జరిగింది. ఎందుకంటే బంగారం ధరించడం వలన ఆరోగ్యానికి మంచిదని, కేవలం ఆరోగ్య రీత్యానే అప్పట్లో బంగారం ధరించేవారు తప్ప ఇప్పటిలా ఆర్భాటం కోసం కాదు. లోహాలు ప్రకృతిలో సహజమైన శక్తి ని (పాసిటివ్ ఎనర్జీ ) ని గ్రహించడం లో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. రాగి, వెండి, బంగార్రాన్ని మనం ధరించగా, అందులో బంగారం శ్రేష్టమైనది. ముఖ్యంగా బంగారాన్ని శరీరం లో కీళ్ళు ఉండే ప్రాంతం లో ధరించాలి ( వంగే ప్రాంతం ).
1.నుదురు – జ్ఞానోద్భవ ప్రాంతం.- ఇక్కడ నుదురుయందు పాపిటబొట్టుగా ధరిస్తాము.
2.చెవి,ముక్కు – ఇక్కడ ఎముక నిర్మాణం చాలా మృదువుగా ఉంటుంది.- చెవికి చెవిలీలు, ముక్కుకి ముక్కెర గాను ధరిస్తాము.
3.మెడ – వంగే ప్రాంతం స్వర పేటిక ఉండే ప్రాంతం- మెడయందు మాంగల్యం,నల్లపూసలు,గొలుసుల రూపం లోను ధరిస్తాము.
4.వక్షస్థలం – హృదయం ( స్త్రీలు మంగళ సూత్రం ధరించే ప్రాతం)
5.నడుము – వంగే ప్రాంతం, జీర్ణాశయం, మూత్రపిండాలు ఉండే ప్రాంతం- నడుముకి వడ్డానం, మొలతాడు రూపంలో ధరిస్తాము.
6.దండాలు – భుజబలం అధికంగా ఉండే ప్రాంతం- దండాలుకి అరవంకీ, దండ కడియాల రూపంలో ధరిస్తాము.
7.మణికట్టు – వంగే ప్రాంతం, హృదయానికి పోయే నరాలు అతి దగ్గరగా ఉండే ప్రాంతం- చేతికి గాజులు, కడియాల రూపంలో ధరిస్తాము.
8.వేళ్ళు – హృదయం నుండి వచ్చే సిరలు, ధమనులు ఉండే ప్రాంతం- చేతి వేళ్ళకు ఉంగరాల రూపంలో ధరిస్తాము.
9.పాదాలు – వంగే ప్రాంతం. గుండెకు పోయే నరాలు దగ్గరగా ఉండే ప్రాంతం- కాలికి పట్టీల రూపంలో ధరిస్తాము.
కాలి వేళ్ళు – హృదయానికి సరాసరి పోయే నరాలు ఉండే ప్రాంతం- కాలి వేళ్ళకి మెట్టెల రూపంలో ధరిస్తారు.
వంగే ప్రాంతం అనగా కీళ్ళు ఉండే ప్రాంతం లో నరాలు ఉంటాయి. కాబట్టి ఇలా బంగారం నుండి గ్రహించిన శక్తి అంతా హృదయానికి చేరుతుంది. అందుకే పెళ్ళిలో ఆడవారికి మాంగల్య దారణ చేసేది. శరీరం లోని ఇలాంటి ప్రాంతాలలో బంగారాన్ని ధరించి తద్వారా ప్రకృతిలోని ప్రాణ శక్తిని గ్రహించి ఆరోగ్యంగా ఉండేవారు మన పూర్వీకులు. ఇలా ఆరోగ్యానికి వాడాలని చెబితే, అది మానేసి బంగారం ఆడంబరం కోసం కొనడం అవి లాకర్లలో పెట్టుకోవడం, రోజు ఇంట్లో అవసరమైనవి ఉంచుకోవడం కూడా కొందరికి విసుగ్గా ఉంటాది. కాని బయటకు వెళ్ళేటప్పుడు గోప్పలకి ఎక్కడలేని బంగారం వేసుకుని దొంగలను తాయారు చెయ్యడం తప్పితే వేరే ప్రయోజనం లేదు. అందుకని బంగారాన్ని ఆరోగ్యానికి అని ఆలోచించండి గాని ఆశతో అనవసరంగా అప్పులు చేసి మాత్రం కొనడం అనవసరం.
Key Words: Today we are explain what is the secret behind usage of GOLD ….