సంస్కరణలు దిశగా విశ్వవిద్యాలయ అడుగులు …….
డాక్టర్ అంబేద్కర్ విశ్వ విద్యాలయం సంస్కరణలు దిశగా అడుగులేస్తోంది. ఓవైపు ఆచార్యుల కొరత, మరోవైపు భవనాల కొరత వీటిన్నింటీకీతోడు అభివ్రుద్ది చేయాలంటే నిధుల కోరత… ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ విశ్వవిధ్యాలయం ఇప్పుడు సరైన ఏక్షన్ ప్లాన్ తో ముందుకేల్తోంది. పిజి కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చి ఐదేళ్ళు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయి ఇబ్బందుల నుండి గట్టెక్కక పోవడం తో ప్రస్తుత ఉపకులపతి ఆచార్య హనుమంతు లజపతిరాయ్ నూతన వొరవడి కి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలో గల ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇది. గతంలో పీజీ కళాశాలగా వున్న విద్యాలయాన్ని 2008 లో యూనివర్సిటీగా మార్చారు. అప్పటి వైఎస్ ప్రభుత్వం తీసుకున్న మంచినిర్ణయమే అయినప్పటికీ బోధనా సిబ్బంది, భవనాల సమస్య కూడా అంబేద్కర్ యూనివర్సిటీకి పట్టిపీడిస్తోంది. 17 కోట్ల రూపాయలతో ఇటీవలే నూతన భవన నిర్మాణాలకు స్వీకారం చుట్టినప్పటికీ మరిన్ని బిల్డింగ్స్ అవసరం ఇంకా వుంది. రెగ్యులర్ బోధకులు, భవన నిర్మాణాల ఆవశ్యతపై ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి హనుమంతు లజపతిరాయ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యార్ధులకు అవసరమయ్యే కొత్త కోర్సులు,వర్శిటీ కి ఈ ఏడాది చేయాల్సిన కార్యాచరణ పై సమన్వయం ముందుకేల్తున్నట్లు విసి తెలిపారు. మునుపెన్నడూ లేనివిధంగా అన్ని వైపులనుండి ఫలితాల సాధన లక్ష్యంగా విశ్వవిద్యాలయం ముందుకేల్తున్నట్లు ఆయన పేర్కున్నారు.
బైట్: హనుమంతు లజపతిరాయ్, ఉపకులపతి