Published On: Sun, May 12th, 2013

శ్రీ అనంత పద్మనాభ స్వామి

Share This
Tags

కోయిలల కుహు..కుహూ రాగాలు, చిలకమ్మల చిలక పలుకులు..సెలయేటి అలల పరవళ్ళతో, మైమరిపించే ప్రకృతి రమణీయత అనంతగిరి కొండల్లోనే ఉంటుం దనడంలో అతిశయోక్తి లేదు. అనంతగిరిలోని ప్రకృతి అందాలు చూప రులను పరవశింప చేస్తుంది. ఇంతటి రమణీయత ఒడిలో ఒదిగిపోయిన అనంత పద్మనాభస్వామి ఆలయం భక్తులను ఎంతగానో ఆర్షిస్తుంది.
శ్రీ అనం త పద్మ నాభ స్వా మి దేవా లయం హైద్రాబాద్‌ నగరానికి 75 కిలో వీటర్ల దూరంలో, రంగారెడ్డి జిల్లా వికారా బాద్‌లో అనంతగిరి కొండలపై వెలసింది. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాం తం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కొండలు, చెట్లు, ప్రశాంత వాతావరణం లో ఉన్న ఈ దేవా
లయానికి ప్రసిద్ధమైన చరిత్ర ఉంది. పురాణ పుటలను ఒక్క సారి తరిచి చూస్తే ఈ దేవాలయం చరిత్ర కనిపిస్తుంది. విష్ణు పురాణంలో అనంత గిరి ప్రస్తావన ఉన్నది. ఈ దేవాలయ సమీపంలో పురాతనమైన ఏడు గుండా లు ఉన్నాయి. దేవాలయ పరిసర ప్రాం తాలలో సుమారు వంద గుహలు ఉన్నాయి. ఈ గుహ లలో ఋషు లు తపస్సు చేసుకునే వారని చరిత్ర చెబుతుంది.

అనంత పద్మనాభ స్వామి చరిత్ర…..
darshanam1అనంత పద్మనాభ స్వామి దేవాలయం సుమారు 13 వందల సంవత్సరాల నాటిదని చరిత్ర చెబుతున్నది. 13 వందల సంవత్సరం లో అంతా దట్టమైన అడవి, కొండలు, గుట్ట లతో ఉన్న ఈ ప్రాంతం ఋషులకు నిలయం గా పేరుగాంచింది. ముచుకుందుడనే రాజర్షి రాక్షసులతో అనేక సంవత్సరా లు యుద్ధం చేసి వారిని ఓడిం చి స్వర్గ లోకాధిపతి అయి న దేవేంద్రుడుని కొలిచి భూలో కంలో తన అలసట తీర్చుకో వడానికి సుఖంగా నిద్రించు టకు ఆహ్లాదకరమైన ప్రశాంత స్థలాన్ని తెలు పాలని కోరాడని కథనం. అంతేకాకుండా తన నిద్ర భంగం చేసిన వారు తన తీక్షణమైన చూ పులతో భస్మం అయ్యేటట్లు వరం ఇవ్వా లని కోరారు. దేవతలకు రాజు అయిన దేవేంద్రు డిని సూచన మేరకు ముచుకుందుడు అనం తగిరి క్షేత్రానికి విచ్చేసి ఒక గుహలో నిద్రపో యినట్లు కథనం. ఇదిఇలా ఉండగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, బలరాముని తో కలిసి పెరిగి పెద్దవాడై తన శత్రువు అయిన కంసుడి ని వధించి ద్వారకానగరాన్ని పాలించసాగాడు. అప్పుడే కాలయముడు అను రాక్షసుడు దండె త్తి ద్వారకా నగరాన్ని ముట్టడించి యాదవ సైన్యాన్ని నాశనం చేశా డు. ద్వారకకు రాజధా ని అయిన మధుర నగ రాన్ని స్వాధీనం చేసు కు న్నాడు.

darshanam2రాక్షసుడి ఘో రకృత్యాలను చూసి శ్రీకృష్ణ బలరాములు రాక్షసునికి భయపడిన ట్లు నటించి ముచు కుందుడు నిద్రించుచున్న అనంతగిరి కొండ గుహలోనికి తమ వెంట వ చ్చే విధంగా పరు గులు తీశారు. శ్రీకృష్ణునిపై ఉన్న వస్త్రాలను తొలగించి కొండ గుహాలలో తపో నిద్రలో ఉన్న ముచుకుందుడిపై కప్పడం తో, శ్రీకృష్ణుడి ని వెంటాడుతూ వచ్చిన కాల యముడు ముచు కుందుడే శ్రీకృష్ణుడని భా వించి ఆయన నిద్ర కు భంగం కల్గిస్తాడు. ముచుకుందుడు కళ్లు తెరిచి కోపదృష్టితో చూడటంతో కాలయము డు భస్మమవుతాడు. అంతలోనే శ్రీకృష్ణుడు, బలరాముడులు ప్రత్యక్షం కావడంతో ముచు కుందుడు సంతోషించి వారి పాదాలను కడిగి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ముచుకుందుడి చేత శ్రీ కృష్ణుడి పాదాలు కడిగిన జలమే జీవనది అయిం దని కథ. కలియుగ ప్రా రంభ మున మహా విష్ణు మార్కేండేయ మహామని కి దర్శనమిచ్చి అతని తపస్సుకు ఫలితంగా సాల గ్రామం రూపం లో అనంత పద్మనాభునిగా అ వతరించాడని మరో కథ ప్రచారంలో ఉన్నది.

భగీరథ గుండం……
అనంత పద్మనాభ స్వామి దేవాలయం పక్కనే భవనాశిని అని పిలిచే భగీరథ గుండం ఉన్న ది. ఈ గుండంలో స్నానమాచరించిన ఆయు రారోగ్యాలు, సంతానం, పెళ్ళి కాని పడతుల కు పెళ్ళిళ్ళు జరుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

మార్కండేయ తపోవనం..
darshanam3పక్కనే మార్కండేయ తపోవనం ఉన్నది. మార్కండేయుడు అనంత గిరి కొండ ల లో తపస్సు చేసినట్లు చరి త్ర చెబుతున్నది. శివసాక్షాత్కారాం తర్వాత అమితమైన భక్తి ప్రపత్తులతో బ్రహ్మదేవుని ఆరాధించి ఆ దేవుని ఆదే శానుసారం భూమండలంలోని భరత ఖండమైన అనంతగిరి చాలా ప్రశాంత స్థలం అని, ఈ స్థలంలో తపస్సు కొన సాగించాలని కోరటంతో మార్కండే యుడు తపస్సు కొన సాగించాడు. మార్కండేయుడు తపస్సు ఆచ రించిన ఆనవాళ్ళు నేటికి ఉన్నాయి. ఆయన నివసిం చిన గుహలో మార్కెండేయ విగ్రహా న్ని ఏర్పాటు చేసి పూజలు జరుపుతున్నారు.

మూసీకి జన్మస్థలం అనంతగిరి…
మూసీనది అనంతగిరి కొండల్లోనే జన్మిం
చింది. ఇక్కడ పుట్టిన మూసీనది జిల్లాలో ప్రవహి స్తూ హైద్రాబాద్‌ మీదుగా నల్గొండా జిల్లాలో నదిలో కలుస్తుం ది.సత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి జాతరను ఈ ప్రాం తంలో ప్రజలు ఎం తో ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఏడాదిలో రెండు మార్లు జాతర ఉత్సవాలు…..
ప్రతి సంవత్సరంలో రెండుసార్లు ఇక్కడ ఉత్స వాలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమిన రథోత్స వం సందర్బంగా 11 రోజుల పాటు జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర ఉత్సవా లు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో జిల్లాకు చెందిన ప్రజలే కాకుం డా హైద్రాబాద్‌, మెదక్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు చెందిన భక్తులు కూడా పాల్గొంటారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్ర ల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

About the Author