రాష్ట్ర పరిశ్రమలకు జాతీయ అవార్డులు
రాష్ట్రానికి చెందిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు జాతీయ పురస్కారాలు లభించాయి. ‘సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో పరిశోధన, అభివృద్ధి ప్రయత్నం’ విభాగంలో పంజాబ్‌కు ప్రథమ, ఆంధ్రప్రదేశ్‌కు ద్వితీయ బహుమతులు లభించాయి. సూక్ష్మ సంస్థలకు సంబంధించి ‘ఎంటర్ పెన్యూర్‌షిప్‌లో అత్యుత్తమ ప్రయత్నాల’ విభాగంలో హర్యానాకు ప్రథమ, బెంగాల్‌కు ద్వితీయ, ఆంధ్రప్రదేశ్‌కు తృతీయ బహుమతులు దక్కాయి. ఇదే విభాగంలో చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్‌కు ప్రథమ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు సంయుక్తంగా ద్వితీయ బహుమతులు లభించాయి. వీటిని త్వరలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.