మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఊతమిచ్చేలా మరో రాష్ట్రం….
మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఊతమిచ్చేలా మరో రాష్ట్రం అధికార వికేంద్రీకరణకు ఆమోదం తెలిపింది.
– దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్‌లో కొత్తగా సమ్మర్ కేపిటల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం. పర్వత ప్రాంతమైన గైర్సైన్‌ను మూడో రాజధానిగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేయనున్నారు. తాజా నిర్ణయంతో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మూడు రాజధానులయ్యాయి.
– ఉత్తరాఖండ్‌కు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా డెహ్రాడూన్, జ్యూడీషియల్ కేపిటల్‌గా నైనిటాల్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గైర్సైన్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించింది. అధికారుల నివాస భవనాలు సహా పలు బిల్డింగ్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. గైర్సైన్ ప్రాంతం సమీపంలో ఏయిర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
– చాలా కాలంగా ఉత్తరాఖండ్ పర్వత ప్రాంత వాసులు చేస్తున్న డిమాండ్ మేరకు చమోలీ జిల్లాలోని గైర్సైల్‌ను వేసవి రాజధానిగా ప్రకటించారు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.
-ఉత్తరాఖండ్‌లో మూడు రాజధానులకు లైన్ క్లియర్ కావడంతో…ఇప్పుడు ఏపీ సర్కారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై చర్చ తెరపైకి వచ్చింది. సీఎం జగన్ కూడా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా వైజాగ్, లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి, జ్యూడీషియల్ కేపిటల్‌గా కర్నూలును చేయాలని ప్రతిపాదించారు. కానీ దీనిపై ప్రతిపక్షాలు, రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
– ఏపీ, ఉత్తరాఖండ్ మాత్రమే కాదు మరికొన్ని రాష్ట్రాలు కూడా అధికార వికేంద్రీకరణపై దృష్టి సారించాయి. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కూడా వివిధ శాఖలకు చెందిన 10 కమిషనర్ కార్యాలయాలు, మండళ్లను బెంగళూరు నుంచి తరలించేందుకు నిర్ణయం తీసుకుంది. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, కలబురగి, ధార్వాడ జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనుంది. అటు జార్ఖండ్ ప్రభుత్వం కూడా నాలుగు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇలా పలు రాష్ట్రాలు అధికార వికేంద్రీకరణపై దృష్టి పెట్టడంతో ఇక్కడ మూడు రాజధానులను సమర్ధించే వైసీపీలో మరింత జోష్ కనిపిస్తోంది.