Published On: Sat, Mar 22nd, 2014

రాష్ట్రానికి రూ. 1.41 లక్షల కోట్లు!

Share This
Tags

ఇరు రాష్ట్రాలు పూర్తి చేయూల్సిన కాంట్రాక్టుల విలువ మొత్తం
ఇందులో సాగునీటి ప్రాజెక్టుల మొత్తమే అత్యధికం
రాష్ట్ర విభజన నేపథ్యంలో మొత్తం రూ.1.41 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను పూర్తిచేయూల్సిన బాధ్యత రెండు రాష్ట్రాలపైనా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టుల మొత్తమే భారీగా ఉంది. ప్రస్తుతం అన్ని రకాల కాంట్రాక్టు పనుల ఒప్పందాలను ప్రాంతాల వారీగా లెక్కించే పనిలో శాఖలు నిమగ్నమయ్యా యి. వైఎస్ జీవించి ఉంటే ఈ పాటికి పోలవరంతో పాటు ప్రాణిహిత- చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశకు చేరి ఉండేవి. ఇంకా అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి అయ్యేవి. కానీ 2009లో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పను లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా తయారయ్యాయి. సాగునీటి ప్రాజెక్టులతో పాటు అనేక ఇతర శాఖల ప్రాజెక్టులు పెండింగ్‌లో పడిపోయూరుు. ప్రసు ్తతం రాష్ట్ర విభజన నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టు పనులతో పాటు రహదారులు, తాగునీరు, పంచాయతీరాజ్, మునిసిపల్, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖలకు చెందిన పెండింగ్ కాంట్రాక్టులను తెలంగాణ, సీమాంధ్ర వారీగా విభజించి, వాటి విలువను లెక్కించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటివరకు సేకరించిన సమాచారం మేరకు ఇరు రాష్ట్రాలకు కలిపి రూ.1.41 లక్షల కోట్ల కాంట్రాక్టు బాధ్యతలు ఉంటాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

About the Author