మన్యంలో ప్రబలిన డయేరియా
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో డయేరియా విజృంభించింది. హుకుంపేట మండలం నరసపాడులో డయేరియాతో పదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా అల్లంపుట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత రెండు రోజుల్లో ముగ్గురు మృతి చెందగా, 16మంది అస్వస్థులయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.