Published On: Sat, May 17th, 2014

పెళ్లిళ్ల మార్కెట్….

Share This
Tags

శని, ఆదివారాల్లో ఊర్లలో సంతలు పెట్టడం అలవాటే.. అయితే.. ఇదే రోజుల్లో చైనాలోని షాంగైలోని పీపుల్స్ పార్క్ వద్దకు వెళితే.. అక్కడ మనకు పెళ్లిళ్ల సంత కనిపిస్తుంది! ఇలా వేలాది సంఖ్యలో కాగితాలు వేలాడదీసి కనిపిస్తాయి. పెళ్లి కావాల్సిన అమ్మాయి లేదా అబ్బాయి బయోడేటాలు ఈ కాగితాల్లోనే ఉంటాయి. వారి వయసు, ఎత్తు, రాశి, ఆదాయం, ఫోన్ నంబర్, తమకు కారు లేదా అపార్ట్‌మెంట్ ఉందా? వంటి వివరాలన్నీ ఇందులో రాసి ఉంటాయి.

అమ్మాయిలు లేదా అబ్బాయిల తాలూకు తల్లిదండ్రులు, బంధువులు ఈ మ్యారేజీ మార్కెట్‌కు వచ్చి.. కాగితాల్లో వివరాలు చూసుకుంటూ పోతారు. తగిన వారు లభిస్తే.. అందులో ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదిస్తారు. తర్వాత షరా మామూలే.. ఇరు కుటుంబాల వారు కలవడం.. మాట్లాడుకోవడం.. పీపీపీ.. డుండుండుం అంటూ పెళ్లి బాజాలు మోగడం వంటివి చకచకా జరిగిపోతాయి.

About the Author