పవన్ ది కాన్ఫిడెస్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
పార్టీ ప్రకటనైతే చేశాడు కానీ… జాతీయ సమగ్రత అనే ఒక్క విషయం తప్ప పవన్ కల్యాణ్ పార్టీ విధివిధానాలు ఏవీ ప్రకటించలేదు. కానీ ఇప్పటికే బీజేపీతో పొత్తులకు సై అని, మోదీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కొడొక గాసిప్ వినిపిస్తుంది. పార్టీ విధివిధానాలు ప్రజలకైతే ప్రకటించలేదు కానీ మోదీకి మాత్రం చెప్పి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే పవన్ పార్టీ పెట్టడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని అంతా అనుకుంటున్న సమయంలో ఇలా పార్టీ పెట్టిన పదిరోజులు కాకముందే పొత్తులకు చేయి చాచడం పవన్ ను కొంతైనా నమ్మే వారికి మింగుడు పడటం లేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన నోవాటెల్ మీటింగ్ తప్ప ఇంకెప్పుడు పవన్ మీడియా ముందుకు రాలేదు. అసలు ఎన్నికల్లో నిలబడుతుందో లేదో చెప్పలేదు. సార్వత్రిక ఎన్నికలకు పట్టుమని ఇంకా నెలా పదిహేను రోజులు కూడా లేని సమయంలో పార్టీ పెట్టి…దాని విధి విధానాలను ప్రకటించకుండా ప్రశ్నిస్తా అంటే…. జనాలు మేమేమీ పిచ్చోళ్లం కాదంటున్నారు. రెండు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో పోటీ చేసేందకు జనసేనకు అభ్యర్ధులు ఎలాగూ దొరకరు కాబట్టి…కనీసం మెజార్టీ స్థానాల్లో అభ్యర్ధులనైనా ప్రకటించాలి. కానీ పవన్ కల్యాణ్ అలా చేయలేదు సరికదా… పర్యటనలు చేస్తున్నారు. ఇదంతా పవన్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా?120 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్, 25 ఏళ్లుగా ఉన్న టీడీపీ పార్టీలే అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు కసరత్తులు చేస్తుంటే….అసలు రాజకీయ అనుభవం లేని పవన్ ఎలా అభ్యర్ధులను ఎంపిక చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్…పవన్ పక్కన ఉన్నవాళ్లు చెప్పిన మాటలు వినో…లేక అన్న మీద కోపమో కానీ జీవితంలోనే పెద్ద తప్పటడుగు వేస్తుడంటున్నారు రాజకీయ విశ్లేషకులు…పవన్ ది కాన్ఫిడెన్స్ కాదు… ముమ్మాటికీ ఓవర్ కాన్ఫిడెన్సే అంటున్నారు.