చంద్రబాబే తెలంగాణను అడ్డుకున్నారు: నాగం
ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబే అప్పుడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డారని గుర్తు చేశారు. రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు.
రాయల తెలంగాణ ఇస్తే బీజేపీ అధికారంలోకి రాగానే ఆ రెండు సీమ జిల్లాలను పంపించేస్తామని వెల్లడించారు. ఎవరి మనోభావాలు గౌరవించేందుకు రాయల తెలంగాణ అంటున్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి భయపడే కాంగ్రెస్ తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టిందని నాగం ఎద్దేవా చేశారు.