Published On: Sat, Mar 22nd, 2014

ఆలగడపలో అరుదైన చేప!

Share This
Tags

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప శివారులోని మూసీవాగులో శుక్రవారం మత్య ్సకారులకు ఓ అరుదైన సముద్రపు చేప లభించింది. వారు ఈ విషయాన్ని కంపసాగర్ మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ కె. వీరాంజనేయులు, కేవీకే శాస్త్రవేత్త లవకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ చేప కేవలం సముద్రంలోనే సంచరిస్తుందని, దీనిని ‘సక్కర్ చేప’ అంటారని శాస్త్రవేత్తలు అన్నారు. దీని మూతి దగ్గర అతుక్కునే స్వభావం ఉంటుందని, భారీ వరదలు వచ్చినప్పుడు ఇది నదుల్లోకి ఎగబాకి ఉండొచ్చని చెప్పారు. ఈ చేప సుమారు 400 గ్రాములు ఉన్నదని, మూడు కేజీల వరకు పెరుగుతుందని వారన్నారు.

About the Author