Published On: Wed, May 14th, 2014

150వ సినిమాతో రఫ్పాడిస్తాడా..?!

Share This
Tags

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా త్వరలో తెరరూపం దాల్చబోతుందట. అంతేకాదు క్రేజీ కాంబినేషన్ కూడా దీనితోనే సెట్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ ను మెగాస్టార్ గా ఏలిన చిరంజీవి తన 150 సినిమాను తీయడానికి సుముఖంగా ఉన్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు దీనిలో చిరంజీవి, తన తనయుడు రామ్ చరణ్ తేజ్ తో కలసి నటించే ఛాన్స్ ఉందని టాక్.
అయితే రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉండటంతో ఇక తన 150వ సినిమాపై దృష్టి పెడుతున్నాడట చిరు. గతంలోనే చిరంజీవి 150వ సినిమాకు చరణ్ సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. వినాయక్ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేశారనే వార్తలు వచ్చాయి. కానీ చివరికి అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇక చాలా రోజుల తర్వాత తాజాగా మరో సారి చిరంజీవి 150చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. అన్నీ కుదిరితే.. చిరంజీవి పుట్టిన రోజు ఆగస్ట్ 22 నే కొత్త సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం మంచి కథ తయారుచేయమని ఇప్పటికే చిరంజీవి కొందరు రచయితలకు చెప్పినట్టు టాలీవుడ్ సమాచారం.ఇదిలా ఉంటే.. మరో వార్త ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్ కు తండ్రిగా చిరంజీవి నటించబోతున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో గానీ ఇప్పుడు చిరంజీవి 150వ సినిమా అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

About the Author