Published On: Sat, Dec 6th, 2014

సంస్కృతంపై వెనక్కి తగ్గిన కేంద్రం..

Share This
Tags

కేంద్రీయ విద్యాలయాల్లో మూడో భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ విద్యా సంవత్సరం థర్డ్ లాంగ్వేజ్‌గా జర్మన్ భాష కొనసాగనుంది. ఈ విషయాన్ని కేంద్రం తరపున అటార్ని జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు శుక్రవారం తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే జర్మన్‌ ను తొలగించి సంస్కృతాన్ని ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని వేలాది మంది విద్యార్థులు తిరస్కరించారు. ఈ అంశంపై తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ విద్యా సంవత్సరంలో జర్మన్‌నే కొనసాగించాలని గత వారం సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించడం, పార్లమెంట్‌లో ఈ అంశాన్ని విపక్షాలు లేవనెత్తడంతో ఎన్డీయే సర్కార్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. కోర్టు ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది.

About the Author