విద్యార్థులకు ఆర్టీసి షాక్
ఎన్నో మెలికలు పెడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న ప్రభుత్వం వారిపై మరో గట్టి దెబ్బ కొట్టింది. లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసేలా ఆర్టీసీ బస్ పాస్‌ల రాయితీలో భారీగా కోత పెట్టింది.
ఒక్కో విద్యార్థికి ఇస్తున్న రాయితీని 23 శాతం తగ్గించింది. దీనివల్ల ఒక్కో విద్యార్థిపై ఏడాదికి 605 రూపాయల అదనపు భారం పడనుంది. కొన్ని రూట్లలో బస్‌పాస్‌ల ధర 100 శాతం పెరగనుంది. పెరిగిన ధరలు వచ్చే నెల ఒకటో తేదీనుంచి అమల్లోకి రానున్నాయి.