ఆ కీటకం రెక్కాడిస్తే బ్యాక్టీరియా అంతం!
వాతావరణంలో కంటికి కనిపించక సూక్ష్మరూపంలో ఉండే బ్యాక్టీరియాను తన రెక్కలతో నాశనం చేసేశక్తి ఉన్న ఒక కీటకజాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది నానో సైజులో ఉండే బ్యాక్టీరియాను పూర్తిస్థాయిలో అంతం చేయగలదన్నారు. ఆస్ట్రేలియా దక్షిణ ప్రాంతంలో కనిపించే ‘సికాడా’ అనే ఈ కీటక రెక్కలకు బ్యాక్టీరియాను నాశనం చేసే శక్తి ఉంటుందన్నారు. ఇలా అత్యంత సహజసిద్ధంగా బ్యాక్టీరియాను నాశనం చేయగల శక్తి ఉన్న ఒక జీవిని గుర్తించడం ఇదే తొలిసారి. హాత్రోన్‌లోని స్విన్‌బర్న్ యూనివర్సిటీ అధ్యయనకర్త ఎలెనె ఇవనోవా ఈ కీటక ం గురించి వివరించారు. ‘నేచర్’ జర్నల్‌లో దీని గురించి ప్రచురించారు. ఈ కీటకం రెక్కలకు ఉండే ‘నానోపిల్లర్స్’ను తాకితే బ్యాక్టీరియా అంతమవుతుందన్నారు. రెక్కల అంచులు చాలా పదునుగా ఉంటాయని, వీటిని తాకితే నానోసైజుస్థాయి బ్యాక్టీరియా కూడా తునాతునకలు అయిపోతుందన్నారు.