Published On: Sun, May 12th, 2013

రామ్ చరణ్ రచ్చ లో కొత్తమలుపు

Share This
Tags
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఫనీష్, కల్యాణ్‌లపై నటుడు రాంచరణ్ తన బాడీగార్డ్స్‌తో దాడి చేయించిన ఘటన కొత్త మలుపు తిరిగింది. కారులో వెళ్తున్న తమను ఇద్దరు యువకులు వెంబడించడంతో ఇంటి వద్ద ఉన్న ప్రైవేటు బాడీగార్డ్స్ వచ్చి.. వారిని అడ్డుకున్నారని చెప్పిన రాంచరణ్ మాటలు అవాస్తవమని నిరూపితమైంది. దాడి చేసినవారు ఆయన రక్షణ కోసం ప్రభుత్వం నియమించిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన కానిస్టేబుళ్లని తేలింది. దాడి ఘటన నేపథ్యంలో రాంచరణ్‌కు కేటాయించిన ఈ గన్‌మెన్‌లను ప్రభుత్వం ఉపసంహరించింది.ప్రాణభయముందని చెప్పి..
తనకు ప్రాణ భయం ఉందని, భద్రత కోసం గన్‌మెన్‌లను ఏర్పాటు చేయాలని ఆర్నెల్ల క్రితం రాంచరణ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రభుత్వపరంగా గన్‌మెన్‌ల సౌకర్యం కల్పించలేమని.. కావాలంటే పేయింగ్(డబ్బులు రాంచరణ్ చెల్లిస్తే) గన్‌మెన్‌లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో పేయింగ్ గన్‌మెన్లు కావాలని అతను చెప్పడంతో ఇటీవలే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన అప్సర్, అంజిరెడ్డి అనే ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రభుత్వం గన్‌మెన్‌లుగా నియమించింది. వాస్తవానికి వీరి పని.. రాంచరణ్‌పై ఎవరైనా దాడి చేస్తే.. ప్రతిఘటించడం.. రక్షణ కల్పించడం.

అయితే, ఎలాంటి ప్రతిఘటన లేకున్నా రాంచరణ్ ఫోన్ చేయగానే, అతని ఇంటి వద్ద ఉన్న వీరిద్దరు.. మరో ఇద్దరు ప్రైవేటు బాడీగార్డులతో కలిసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని.. ఫణీష్, కల్యాణ్‌లను అకారణంగా చితకబాదారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వీరు.. రాంచరణ్ చెప్పినట్లు చేస్తూ.. ఇలా వ్యవహరించడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా తన గన్‌మెన్లను ఉపయోగించుకున్నారని చెబుతూ.. రాంచరణ్‌కు కేటాయించిన కానిస్టేబుళ్లను శుక్రవారం ఉపసంహరించింది. ఇష్టం వచ్చినట్లు గన్‌మెన్లను వాడుకోరాదని ఉపసంహరణ పత్రంలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. దీన్ని అడ్డుకోవడానికి చిరంజీవి చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే వాదన వినిపిస్తోంది.

Ram-charan-security-Beatean-IT-engeners-(17)

About the Author