మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-గోవా హైవేపై ఓ బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఖేదా వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడ్డట్టు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల బస్సు అదుపు తప్పినట్లు భావిస్తున్నారు. గాయపడ్డ వారిని ఖేడాలోని ఆసుపత్రికి తరలించారు.