భారత్ వెళ్తున్నారా.. మృగాళ్లుంటారు జాగ్రత్త!
‘భారత్ వెళ్తున్నారా? మృగాళ్లుంటారు జాగ్రత్త!’ అంటూ బ్రిటన్ తన దేశ మహిళలను హెచ్చరించింది. భారత్ అత్యాచారాల అడ్డాగా మారిందని, ఈ నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఈ మేరకు ఫారిన్, కామన్‌వెల్త్ ఆఫీస్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. విదేశీ మహిళలపై భారత్‌లో జరుగుతున్న అత్యాచారాలను ఆయన ఉటంకించారు. బీచ్‌లు, నిర్జన ప్రదేశాల్లో సాధ్యమైనంత మేరకు సంచరించకుండా ఉంటే మంచిదని బ్రిటన్ మహిళలకు తమ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు.