బోరబండ ఉప ఎన్నికలో ఎంఐఎం గెలుపు
బోరబండ డివిజన్ 108 కార్పొరేటర్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి భానుమతి విజయం సాధించింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అధికారులు ఉప ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించలేదు. గతంలో గెలుపొందిన ఆ డివిజన్ కార్పొరేటర్ వనజ అధిక సంతానం వల్ల డిస్‌క్వాలీఫై అయిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈరోజు ఉదయం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎంఐఎం అభ్యర్థి భానుమతి 1484 ఓట్ల ఆధిక్యంతో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రజియా సుల్తానాపై గెలుపొందారు.