Published On: Fri, Jul 11th, 2014

దృశ్యం‌ రివ్యూ…..

Share This
Tags

వెంకటేష్ అంటే కుటుంబ కధానాయకుడు,అయన సినిమా అంటే కుటుంబంతో కలసి చక్కగా చూడొచ్చు అనే ముద్ర …అదే ముద్రని చక్కగా నిలబెట్టుకున్నారు ఈ సినిమాతో,ఓ మంచి భర్తగా, ఓ తండ్రిగా తన పాత్రకు తగిన న్యాయం చేసారు. తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు…సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వాడు..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ … ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్ లు వేసి , తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం. దైవం చెప్పిన మార్గం ప్రవచనాలు అంటూ ఇందులో సినిమా మొత్తం ఓ వాక్యం అందరి నోటమ్మట వినపడుతూ ఉంటుంది. సినిమాకు కీలకంగా నిలిచే ఆ వాక్యం …ఎందుకింత విచిత్రంగా, ఉంది అంటే…మళయాళంని ఉన్నది ఉన్నట్లు ఇక్కడ నేటివైజ్ చేయాలనే తాపత్రయం. ఇలాంటివి పంటిక్రింద రాయిలా తగులుతూ ఉంటాయి రీమేక్ ని మక్కికి మక్కీ దించారు అనే విషయం కన్నా…. సినిమాలో టెంపో ఎక్కడా సడలకుండా రూపొందించిన సన్నివేశాల మధ్యలో కమర్షియల్ అంశాల పేరిట కామెడీ, ఐటం సాంగ్ వంటివి కలపకపోవటం ఈ దర్శకురాలు చేసిన పెద్ద తెలివైన పని. ఇలాంటి థ్రిల్లర్ జానర్ లో ఓపెన్ స్క్రీన్ ప్లే తో వచ్చే సినిమాలు మన తెలుగులో చాలా అరుదు అనే చెప్పాలి. మళయాళంలో ఘన విజయం సాధించటం, తక్కువ బడ్జెట్ లో రూపొందించబడటం, యూనివర్శిల్ అప్పీల్ ఉన్న కథ,కథనం అనే అంశాలు ఈ రీమేక్ ను తెలుగుకు వచ్చేలా చేసాయి. తెలుగులో వరస రీమేక్ లు…ముఖ్యంగా ఫ్యామిలీ కథలు చేసే వెంకటేష్ ఈ ప్రాజెక్టులోకి రావటంతో సగం సక్సెస్ సినిమా రిలీజ్ కు ముందు ఖరారైంది. ఆల్రెడీ ప్రూవైన …రీమేక్ చిత్రం కాబట్టి కథనంపై విష్లేషణ ప్రత్యేకంగా అనవసరం.2008 లో వచ్చిన జపనీస్ చిత్రం Suspect X ని ఎంతో సమర్ధవంతగా ఇండియన్ నేటివిటికి మార్చి దర్శకుడు జీతు జోసెఫ్ మళయాళంలో అందిస్తే…దాన్ని మక్కికి మక్కి అక్షరం కూడా(డైలుగుల్లో కూడా) పొల్లు పోకుండా…నటన తో సైతం దించే ప్రయత్నం చేసింది దర్శకురాలు. వెంకటేష్, మీనా, నదియా, నరేష్ వంటి సీనియర్ నటులు తమ నటనతో దాన్ని దాటారు కాబట్టి ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు కానీ లేకపోతే చాలా తేడా చిత్రంగా మిగిలేది.

About the Author