తొలి సోలార్ ఫ్యామిలీ కార్ వచ్చేసింది..
సౌర శక్తితో నడిచే కార్లు ఇప్పటికే చాలా వచ్చేసినా.. మొత్తం ఫ్యామిలీ అంతా ప్రయాణించే వీలున్న కారు మాత్రం రాలేదు. ఇప్పుడా కొరత కూడా తీరిపోయింది. నెదర్లాండ్‌లోని ఇందోవెన్ వర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 22 మంది విద్యార్థులు ప్రపంచంలోనే తొలిసారిగా ‘స్టెల్లా’ అనే ఫ్యామిలీ సోలార్ కార్‌ను తయారుచేశారు. ఇప్పటివరకూ సోలార్ కార్లలో ఒకరు మాత్రమే ప్రయాణించేందుకు వీలుండగా.. ‘స్టెల్లా’లో నలుగురు కూర్చునే వీలుంది. ఒక్కసారి బ్యాటరీని చార్జ్ చేస్తే 600 కి.మీ. ప్రయాణించొ చ్చు. పైగా.. ఇందులో ఉండే సోలార్ సెల్స్ కారు ఉపయోగించే దానికన్నా ఎక్కువ కరెంటును ఉత్పత్తి చేస్తాయట! అంటే.. అదనపు విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు సరఫరా చేయొచ్చు. దీన్ని తక్కువ బరువుండే కార్బన్ , అల్యూమినియం వంటివాటితో తయారుచేసినట్లు యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.