కి.మీ దూరం నుంచి త్రీడీ ఫొటోలు..!
ఒక కి.మీ దూరంలోని వస్తువులను ఫొటో తీసే అత్యాధునిక లేజర్ కెమెరాను ఎడిన్‌బర్గ్‌లోని హెరియోట్ వాట్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధిపరచారు. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇమేజింగ్ విధానంలో పనిచేస్తుంది. తొలుత తక్కువ శక్తిగల లేజర్ కిరణాలు ఫోటో తీయాల్సిన వాటిపై ప్రసరించి తిరిగి కెమెరాకు చేరతాయి. కాంతి కిరణాల్లోని కాంతి కణాలు పిక్సెల్స్ వారీగా రికార్డవుతాయి. తర్వాత ఓ డిటెక్టర్ వాటిని విడదీసి
ఫొటోగా మారుస్తుంది.