కష్టాలలో కొండంత అండ …అభివృద్దే ఆమె అజెండా…..
->పదవి చేపట్టిన పదిహేను నెలల్లో ….ఎన్నో మైలురాళ్ళు దాటిన వైనం !
->చిత్తశుద్దితో సిక్కోలు అభివృద్దిపై కృపారాణి దృష్టి
->సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
->కష్ట కాలంలో కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా …
->అభివృద్దిలో ప్రత్యేక అజెండా ..కార్యకర్తలకు కొండంత అండ
->సంక్రాంతి స్పెషల్ సకెస్స్ ఫుల్ పెర్సనాలిటి రివ్యూ…
->కేంద్ర ఐటి,కమ్యునికేషన్ల శాఖ సహాయ మంత్రి డా.కిల్లి కృపారాణి యాక్షన్ ప్లాన్ పై స్పెషల్ రిపోర్ట్ …
పదిహేను సంవత్సరాల పాటు అనేక పదవులు అనుభవించిన ధర్మాన లాంటి వారు కాంగ్రెస్ పార్టీకి జలక్ ఇస్తే ….కేంద్ర మంత్రి పదవి చేపట్టిన పదిహేను నెలలలోపే జిల్లా అభివృద్ధిపై కృత నిశ్చయంతో పనిచేసిన క్రుపారాణి…కష్టకాలంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా నిలబడగలిగారు….అభివృద్ధి అజెండాను,అధికారపార్టీ జెండాను జిల్లా వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ ను రూపొందించడంలో సక్సెస్స్ అయ్యారు….
మారుమూల శ్రీకాకుళం జిల్లా నుండి హస్తినవరకు తనదైన ముద్రవేసిన ఈ మహిళ సిక్కోలు జిల్లా అభివృద్దిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు ….2012 అక్టోబరు 28 వ తేదీన కేంద్ర మంత్రి పదవీ భాద్యతలు స్వీకరించిన నాటి నుండి నేటివరకు తన శాఖపై పట్టుతోపాటు తన సొంతగెడ్డ శ్రీకాకుళం జిల్లా సమస్యలపై ప్రత్యేక చొరవ చూపించారు …..ముఖ్యంగా జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి కదలిక తెచ్చేవిదంగా ఆమె సఫలీకృతులయ్యారు….గతంలో తెలుగుదేశం పార్టీ నుండి ఎన్.డి.ఎ హయంలో దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పదవీ భాద్యతలు చేపట్టారు…అయితే మహిళగా తన శాఖపై పట్టు సాధించడం తో పాటు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ధర్మాన లాంటి సీనియర్ నేతలు జిల్లా లో జులక్ ఇచ్చినప్పటికీ ఈమె కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచి కేడరును గాడిపెట్టి నేనున్నానంటూ బరోసా ఇవ్వడంలో డా.క్రుపారాణి సక్సెస్స్ అయ్యారు…….
ఈమె పేరు డాక్టర్ కిల్లి కృపారాణి….కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,కమ్యునికేషన్ల శాఖ సహాయమంత్రి …. చాలామందికి పదవులు వన్నెతెస్తాయి…. ఈమె మాత్రం పదవులకు వన్నె తెచ్చారనడం లో ఎలాంటి సందేహం లేదు …. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందినా ఈమె జిల్లా కాంగ్రెస్స్ అద్యక్షురాలుగా, 2009 లో శ్రీకాకుళం పార్లమెంటరి నియోజకవర్గ ఎం.పి గా గెలిచి తనదైన శైలిలో సేవలు అందించారు ….లేడి లీడర్ గా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన డాక్టర్ కిల్లి క్రుపారాణి కి కాంగ్రెస్ అధిష్టానం సైతం గుర్తించింది… గత ఏడాది జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో క్రుపారాణికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,కమ్యునికేషన్ల శాఖ సహాయమంత్రి పదవి ని కట్టబెట్టింది …. కేంద్ర మంత్రి పదవి ని సవాల్ గా తీసుకున్న ఈమె తమ శాఖ కు వన్నె తెచ్చింది …. ముఖ్యంగా సిక్కోలు జిల్లా కు క్రుపారాణి పదవి భాద్యతలు వరంగా మారాయి … ఇటీవలే క్రుపారాణి చేపట్టిన రాహుల్ సంకల్ప యాత్ర కాంగ్రెస్ పార్టీ కి ఆయా ప్రాంతాల్లోమంచి మైలేజీ ని తెచ్చిపెట్టింది …. ఇచ్చాపురం నియోజకవర్గం లో ఇచ్చాపురం, కంచిలి, సోంపేట,మండలాలలో రాహుల్ సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తి చేసిన క్రుపారాణి అన్ని మండలాలలో కార్యక్రమాల నిర్వహణకు నడుం బిగించారు …. ప్రతీ వ్యక్తి విజయం వెనుక ఎవరో ఒకరు ఉన్నట్లే ఈమె సక్సెస్ వెనుక భర్త డాక్టర్ రామ్మోహన్ రావు కృషి కూడా ఎంతో వుంది…. ఎం .పి .గా ,కేంద్ర మంత్రి గా పదవులకు వన్నె తెచ్చ్గిన కిల్లి క్రుపారాణి కి ఈ రాష్ట్రం డాట్ కాం ‘సక్సెస్స్ ఫుల్ పెర్సనాలిటీ ‘గా ప్రకటిస్తోంది …. డాక్టర్ కిల్లి క్రుపారాణి జీవిత విశేషాలు , లైఫ్ స్టైల్ … మరిన్నిఇంటర్వ్యూలు మీ కోసం …….