Published On: Tue, Mar 5th, 2013

ఎవరికైనా నయం చేయగలం: ఆస్ట్రేలియన్ వైద్యులు

Share This
Tags

‘చికిత్స లేదు నివారణ ఒకటే మార్గం’ అనుకున్న హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ను నయం చేయడంలో విజయం సాధించగలమని వైద్య పరిశోధకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఐవీ వైరస్‌ను నశింపజేయడంలో కీలకమైన ప్రగతి సాధించామని మెల్‌బోర్న్‌లోని ఆల్ఫ్రెడ్ ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. రక్తకణాల్లో దాక్కుని ఉన్న హెచ్‌ఐవీ వైరస్‌ను నశింపజేయడానికి తగిన వైద్యవిధానాన్ని తాము రూపొందించామని వీరు తెలిపారు. క్యాన్సర్ నివారణకు ఉపయోగించే ఒరినోస్టాట్‌తో ఈ వైద్య ప్రక్రియ ఉంటుందన్నారు. ఈ మందు హెచ్‌ఐవీ జన్యువులపై ప్రభావం చూపగలదని తెలిపారు. ఇది వరకు హెచ్‌ఐవీ నివారణలో అందుబాటులో ఉన్న వైద్య విధానాల కన్నా ఇది ప్రభావవంతమైనదని విశ్వాసం వ్యక్తం చేశారు.

About the Author