ఇక ఆధార్‌తో ‘ఉపాధి’ వేతనాలు
ఉపాధిహామీ పథకం కూలీలందరికీ మే నుంచి వేతనాలను ఆధార్ కార్డుతో అనుసంధానించి బ్యాంకుల ద్వారా చెల్లించాలని ‘రాష్ట్ర ఉపాధి హామీ మండలి’ నిర్ణయించింది. బుధవారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించాలని నిర్ణయించినట్లు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి మాణిక్యవరప్రసాద్ చెప్పారు. కొత్తగా 23 పనులను ఈ పథకంలో చేర్చామని, ఏప్రిల్ నుంచి వేతనం రోజుకు రూ. 149 పెంచుతున్నట్లు చెప్పారు.