జగనన్న గృహ నిర్మాణం…..
ఎపీలో పేదోడి సొంతింటి కల త్వరలో నెరవేరబోతోంది. తమకు ఇంటి జాగా లేదని బాధ పడుతున్న వారికి స్నేహహస్తం అందిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత..ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన సీఎం జగన్..అనుకున్నట్లుగానే హామీని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ అంశాలపై అంశంపై ప్రత్యేక పల్సెస్ వారి ఈ రాష్ట్రం డాట్ కాం ప్రత్యేక కకథనం.
తండ్రి తలపెట్టిన పథకాలను పక్కాగా అమలు చెయ్యడం. కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులో తేవడం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రథాన్ని కదం తొక్కించే తీరు, దేశంలోనే అపూర్వం. అనితర సాధ్యం అనిపిస్తుంది. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని సంక్షేమ శకం నడిచింది. దేశంలో ఎవరూ ఊహించనన్ని సంక్షేమ పథకాలతో ప్రజలకు జీవితమే ఒక పండగ, రైతులకు వ్యవసాయం పండగ, విద్యార్థులకు పెద్ద చదువుల పండగ.