సామాజిక బాధ్యత లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్న డాక్టర్ శ్రీనుబాబు గారు..
డాక్టర్ శ్రీనుబాబు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంస్థలు పల్సస్ ద్వారా అంతర్జాతీయ సమావేశాలు నిర్వహిస్తూ, ఆన్‌లైన్ జర్నల్స్ ప్రచురిస్తున్నారు.
సామాజిక బాధ్యత లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. ఇటీవల ఉత్తరాంధ్ర ప్రాంతాన్నిఅతలాకుతలం చేసి లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిన తితిలీ తుఫాన్..సహాయకచర్యలలో పాల్గొనడం ద్వారా, లక్ష మందికి పైగా బాధితులకు సాయం అందించడం ద్వారా శ్రీనుబాబు తన బాధ్యతను నిర్వర్తించారు. ఒక్కొక్కరికీ 10 కేజీల బియ్యం, దుప్పటి, చీర చొప్పున లక్ష మందికి పంపిణీ చేశారు. వనరులున్నా వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నశ్రీనుబాబు.. మారుమూల ప్రాంతాలకు సైతం ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయరంగ సమాచారం ..ఆయా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని బృహత్తర యజ్ఞాన్ని పూర్తిచేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. వైద్యారోగ్య, సామాజిక సేవారంగాలకు అమూల్యమైన సేవలు అందించిన శ్రీనుబాబును ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల.. వివిధ సంఘాల ప్రముఖులు, పల్సస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.