Published On: Sat, Dec 29th, 2018

డాక్టర్ గేదెల శ్రీనుబాబుకు చాంపియ‌న్స్ ఆఫ్ చేంజ్‌ అవార్డు…

Share This
Tags

సామాజిక‌సేవ‌, వైద్యారోగ్య ప‌రిర‌క్ష‌ణ రంగాల‌కు డాక్ట‌ర్ గేదెల శ్రీనుబాబు అందిస్తున్న సేవ‌ల‌కు గానూ చాంపియ‌న్స్ ఆఫ్ చేంజ్ అవార్డు వ‌రించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వ‌న్ వీవీఐపీ లాంజ్‌లో మంగ‌ళ‌వారం ఉప‌రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ ఎం వెంక‌య్య‌నాయుడు ఈ అవార్డును అంద‌జేసారు. వేలాది మంది నిరుద్యోగుల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించి ఉద్యోగ ప్ర‌దాత‌గా కీర్తి గ‌డించిన డాక్ట‌ర్ శ్రీనుబాబు హైద‌రాబాద్‌, చెన్నై, గుర్‌గావ్‌, విశాఖ కేంద్రాలుగా ఏడు యూనిట్ల‌ను క‌లిపి ఒక సెజ్‌గా నిర్వ‌హిస్తూ వేలాది మందికి ఉద్యోగాలు క‌ల్పించారు. హెల్త్‌కేర్‌, హెల్త్ ఇన్‌ఫార్మాటిక్స్ రంగాల‌లో 40 దేశాల‌లో వ్యాపార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నారు. డాక్ట‌ర్ శ్రీనుబాబు సీఈవో, మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ సంస్థ‌లు ప‌ల్స‌స్‌ ద్వారా అంత‌ర్జాతీయ స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, ఆన్‌లైన్ జ‌ర్న‌ల్స్ ప్ర‌చురిస్తున్నారు.
సామాజిక బాధ్యత లో భాగంగా సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను పెద్ద ఎత్తున చేప‌ట్టారు. ఇటీవ‌ల ఉత్త‌రాంధ్ర ప్రాంతాన్నిఅత‌లాకుత‌లం చేసి ల‌క్ష‌లాది మందిని నిరాశ్ర‌యుల‌ను చేసిన తితిలీ తుఫాన్‌..స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌లో పాల్గొన‌డం ద్వారా, ల‌క్ష మందికి పైగా బాధితుల‌కు సాయం అందించ‌డం ద్వారా శ్రీనుబాబు త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించారు. ఒక్కొక్క‌రికీ 10 కేజీల బియ్యం, దుప్ప‌టి, చీర చొప్పున ల‌క్ష మందికి పంపిణీ చేశారు. వ‌న‌రులున్నా వెన‌క‌బ‌డిన ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో 10 ల‌క్ష‌ల మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నశ్రీనుబాబు.. మారుమూల ప్రాంతాల‌కు సైతం ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌, వ్య‌వ‌సాయ‌రంగ స‌మాచారం ..ఆయా ప్రాంతీయ భాష‌ల్లో అందుబాటులోకి తేవాల‌ని బృహ‌త్త‌ర య‌జ్ఞాన్ని పూర్తిచేయాల‌నే సంక‌ల్పంతో ప‌నిచేస్తున్నారు. వైద్యారోగ్య‌, సామాజిక సేవారంగాల‌కు అమూల్య‌మైన సేవ‌లు అందించిన శ్రీనుబాబును ఛాంపియ‌న్స్ ఆఫ్ చేంజ్ అవార్డుకు ఎంపిక చేయ‌డం ప‌ట్ల.. వివిధ సంఘాల ప్ర‌ముఖులు, ప‌ల్స‌స్‌ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

డాక్టర్ శ్రీను బాబు
డాక్టర్ శ్రీనుబాబు గేదెల 25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ ప్రసిద్ది గాంచిన స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టోరల్ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయములో పీ,హెచ్ డీ సాధించారు. 2007 సంవత్సరములో డాక్టర్ శ్రీనుబాబు గేదెల దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హ్యూమన్ ప్రొటెయోమి సంస్థ నుండి యువ వైజ్ఞానిక అవార్డును అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనల ఫలితాలను పరిశోధన గ్రంధములు మరియు సైన్స్ సమావేశాల ద్వారా ప్రపంచ వ్యాప్తముగా వ్యాపింప చేసే ఉద్దేశముతో ఒమిక్స్ మరియు పల్సస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను స్థాపించారు. విద్యార్థి దశలో పరిశోధన సాహిత్యాన్ని పొందడానికి ఎదుర్కొన్న పలు చేదు అనుభవాలు ఒమిక్స్ మరియు పల్సస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశోధన ప్రచురణల సంస్థలు స్థాపించడానికి ఆయనను ప్రేరేపించాయి. అనుక్షణము మారి పోతున్న వైజ్ఞానిక ఫలితాలను ప్రపంచ వ్యాప్తముగా విద్యార్థులు, మరియు పరిశోధకులందరికి అందించడమే ఈ సంస్థల ప్రధాన లక్ష్యం.

ప్రపంచ వ్యాప్తముగా విద్యార్థులు, పరిశోధకులు సమాచార సేకరణ కొరకు పలుకష్టాలకు ఓర్చి ప్రయత్నించినా, గ్రంధాలయములు అందరికి అందుబాటులో లేక సకాలంలో సమాచారము పొందలేక పోతున్నారు. పరిశోధనా ఫలితాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పరిశోధకులకు అందుబాటులో ఉండటంలేదు. ఈ పరిస్థితులలో ఆంధ్ర విశ్వవిద్యాలయం లో తన తోటి శాస్త్రవేత్తలు , స్నేహితుల ప్రోత్సాహముతో బాటు స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం పండితుల ప్రోత్సాహంతో జర్నల్ అఫ్ ప్రొటెయోమిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ ఓపెన్ యాక్సెస్ అనే పరిశోధనా జర్నల్ను ప్రారంభించారు డా. శ్రీనుబాబు. ప్రారంభం నుండే ప్రోటీన్ఓమిక్స్ మరియు డయాబెటిస్ రంగంలో పరిశోధనల పై ఆసక్తి కలిగివున్న డా గేదెల తన సంస్థకు ఒమిక్స్ ఇంటర్నేషనల్ అని నామకరణము చేశారు.

ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (OIPL) పరిశోధనకు అనువుగా ఓపెన్ యాక్సెస్ వేదికను అందించే ఏకైక లక్ష్యంతో బాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క విభిన్న రంగాలకు సంబంధించిన సమాచారాన్ని రీసెర్చ్ పండితులు, విద్యార్ధులు, లైబ్రరీలు, విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలు మరియు పరిశ్రమలకు ఇంటర్నెట్ ద్వారా ఉచితముగా అందేలా చేస్తోంది.
ప్రస్తుతం ఒమిక్స్ ఇంటర్నేషనల్ ఆరు స్పెషల్ ఎకనామిక్ జోన్ల నుండి 5000 కి పైగా ఉద్యోగులతో, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ కేంద్రముగా పనిచేస్తున్నది. వీరిలో 75% మంది మహిళాఉద్యోగులుండటం విశేషం. విస్తరణలో భాగంగా, అమేరికా, కెనడా మరియు యూరోపియన్ దేశాలకు చెందిన పలు చిన్న, మధ్యంతర ప్రచురణ మరియు సమావేశ నిర్వాహణా సంస్థలను ఒమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థ తన ఆధీనంలోకి తెచ్చుకున్నది.

ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిరంతరం వృద్ధి చెందుతూ, తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. ప్రస్తుతం ఒమిక్స్ సంస్థ 1000 కి పైగా ప్రచురణలు, మరియు 3000 కు పైగా జరిగే ప్రపంచ వ్యాప్త సైన్స్ సమావేశాల తో క్లినికల్, మెడికల్, ఫార్మాస్యూటికల్, ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన సమస్త సమాచారాన్ని అందరికి ఉచితముగా అందుబాటులో ఉంచింది. సాలీనా, ఒమిక్స్ 50,000 కు పైగా పరిశోధనా వ్యాసాలు ప్రచురిస్తూ, ప్రపంచ వ్యాప్తముగా, 60, 000 కు పైగా శాస్త్రవేత్తలను తన సమావేశాల ద్వారా ఒకే వేదికపై తెస్తూ, శాస్త్ర, సాంకేతిక పరిశోధనా ఫలితాలను చర్చిస్తూ, సమాచార మార్పిడికి దోహదం చేస్తున్నది. తన సమావేశాల ద్వారా వ్యాపార, వాణిజ్య, సాంకేతిక నిపుణుఁలతో పాటు, యువశాస్త్రవేత్తలను, విద్యార్థులను ఒకే వేదికపై చేర్చి కొత్త పరిశోధనలకు శ్రీకారం చుడుతున్నది ఒమిక్స్.

పల్సస్ హెల్త్ టెక్ మరియు పల్సస్ 1984 లో స్థాపించబడిన ఒక మల్టీనేషనల్ సంస్థ. ఇది ప్రస్తుతం లండన్, సింగపూర్ , చెన్నై, గురుగావ్ మరియు హైదరాబాదు కేంద్రముగా, హెల్త్ టెక్, హెల్త్ ఇన్ఫోర్మాటిక్స్, ఫార్మకోవిజిలెన్స్, మరియు మెడికల్ పబ్లిషింగ్ రంగాలలో తన సేవలు అందిస్తున్నది. 2015 సంవత్సరం నుండి ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పల్సస్ సంస్థలు సంయుక్తంగా హెల్త్ టెక్, హెల్త్ ఇన్ఫోర్మాటిక్స్, బయో ఇన్ఫోర్మాటిక్స్ మరియు మెడికల్ పబ్లిషింగ్ రంగాలకు సంబంధించి పలు వస్తువులు మరియు సేవలను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
లక్ష్యం: పరిశోధనలో భాష అడ్డంకులను తొలగించడం. ఉచితంగా, ప్రజలు ఇష్టపడే వారి భాషలో ప్రపంచం యొక్క నలుమూలలా ఆరోగ్య మరియు శాస్త్రీయ సమాచారం అందుబాటులో ఉంచడం.

About the Author